Horoscope Today: మేషం: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పనులు ఫలిస్తాయి. నూతన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు సాగుతారు.
వృషభం
వృత్తిలో ఇబ్బందులు వస్తాయి. ఏ పని చేసినా సరే వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త పడండి.. నూతనకార్యాలు మొదలు పెట్టకండి. ఇతరులకు ఇబ్బందిని కలుగించే పనులు కూడా చేయవద్దు.
మిథునం
బంధు, మిత్రులతో జాగ్రత్త. పనులలో ఇబ్బందులు వస్తాయి. కొత్త పనులను మొదలు పెట్టుకోవద్దు. గృహంలో వచ్చే మార్పులు ఇంట్లో ఆందోళనను చెందిస్తాయి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త.
కర్కాటకం
శుభకార్యాలు మెరుగ్గా జరుగుతాయి. శుభవార్తల సమయం. ఆకస్మిక ధనలాభం వస్తుంది. ప్రతయ్నకార్యాలన్నింటిలో మంచి ఫలితాలు వస్తాయి. కీర్తి, ప్రతిష్ఠలు మీ సొంతం. విందులు, వినోదాల్లో చురుగ్గా ఉంటారు.
సింహం
ఆకస్మిక ధననష్టం వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త. పక్కదోవ పట్టించేవారి మాటలు వినడం వల్ల మరింత నష్టం వస్తుంది. క్రీడాకారులకు, రాజకీయనాయకులకు ఆందోళన వస్తుంది. నూతనకార్యాలు వాయిదావేసుకొండి.
కన్య
మనోధైర్యాన్ని కోల్పోవద్దు. నూతన కార్యాలకు ఆటంకం వస్తుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులు వస్తాయి. ఇతరులకు హాని తలపెట్టవద్దు.
తుల
ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సమయం మీకు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం క్లియర్ అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. సహనం అన్నివిధాలా మంచిది అని గుర్తు పెట్టుకోండి. డబ్బును పొదుపుగా వాడాలి.
వృశ్చికం
ఆకస్మిక ధనలాభం వస్తుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందే సమయం ఇది. విద్యార్థుల ప్రతిభకు మంచి గుర్తింపు వస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వినే సమయం కూడా.
ధనుస్సు
కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అధికారుల పొగడ్తలు, గౌరవాలు అందుతాయి. పట్టుదలతో కార్యాలు పూర్తిచేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. పిల్లలవల్ల ఇబ్బందులు వస్తాయి.
మకరం
కీర్తి, ప్రతిష్ఠలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కొత్త వస్తు, ఆభరణాలు వస్తాయి.. ఇతరులకు ఉపకారం చేస్తారు. దీని కోసం వెనకడుగు వేయరు. అప్పుల బాధలు పోతాయి. శత్రుబాధలు కూడా ఉండవు.
కుంభం
బంధు, మిత్ర విరోధం ఏర్పడవద్దు. సో జాగ్రత్త. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మీనం
శుభకార్య ప్రయత్నాలు త్వరగా జరుగుతాయి. బంధు, మిత్రులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాల మంచి ఫలితాలను అందిస్తాయి. శ్రమకు తగ్గ ఫలం వస్తుంద. డబ్బు తో ఇబ్బంది ఉండదు. సమాజంలో గౌరవం లభిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..