https://oktelugu.com/

AP Rains: ఏపీలో అలజడి.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రభుత్వం అలెర్ట్

ఏపీలో మరోసారి అలజడి నెలకొంది. విస్తారంగా వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా వరికోతల సమయంలోనే వర్షాలు పడుతుండడంతో పంటలకు నష్టం తప్పడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : December 20, 2024 / 09:51 AM IST

    AP Rains

    Follow us on

    AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఆశించిన స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యింది. తమిళనాడు, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఏపీకి సంబంధించి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సైతం వర్షం పడుతోంది. ప్రధానంగా నెల్లూరు, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.విశాఖపట్నం,కాకినాడ,అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా,బాపట్ల, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితులు నేడు కూడా కొనసాగనున్నాయి.

    * బలహీనపడినా.. ప్రభావం
    ప్రస్తుతం అల్పపీడనం బంగాళాఖాతంలో నైరుతి దిశకు ఆనుకొని పశ్చిమ మధ్య ప్రాంతంలో ఉంది. దీని ప్రభావం ఏపీతోపాటు తమిళనాడుపై ఉంటుంది. భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ అల్పపీడనం బలహీన పడిందని.. క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు- దక్షిణ కోస్తా తీరం వైపు చేరుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి సాగుతుందని.. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

    * ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
    అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.