today horoscope in telugu : ఈ రాశుల వారికి ఈరోజు అకస్మాత్తుగా ధన లాభం..: సూర్యుడు మకర సంక్రాంతిలోకి ప్రవేశించిన తర్వాత ఆయారాశుల్లో మార్పులు జరిగాయి. ఇందులో భాగంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు ఆయుష్మాన్ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఆకస్మాత్తుగా ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) :, కుటుంబంలో వివాదాలు ఏర్పడతాయి. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అయితే పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. లేకుంటే ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఓ వ్యాధి కారణంగా బాధపడతారు. దీనిపై నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా గొడవలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. కొత్తవారిని అప్పుడే నమ్మకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కొత్త జీవిత భాగస్వామిని కుటుంబానికి పరిచయం చేస్తారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కచ్చితంగా విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు ఈరోజు అనుకూల వాతావరణం. ప్రజల నుంచి అధిక మద్దతు పొందే అవకాశం. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కోసం ప్రయాణాలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. పెండింగ్ అప్పులను ఉంటే పరిష్కరించుకుంటారు. కొన్ని కారణాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఏదైనా పని కోసం సమయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : పరిశోధనాత్మకత పనులు చేపడతారు. దీంతో సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఏ పని చేసినా ఓపిక ఉండాలి. తొందరపడి ఇతరులను హేళన చేయొద్దు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కార్యాలయాల్లో పని ఒత్తిడి ఉంటుంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఒకరి ప్రభావం వలన కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే వీరు కొత్త వ్యక్తుల పరిచయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేస్తారు. ఈ క్రమంలో పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఇంటి అవసరాల కోసం ఖర్చులు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. అయితే గతంలో చేపట్టిన ఓ పని పూర్తి చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. సలహాలు కావాలంటే తల్లిదండ్రులను ఆశ్రయించాలి. కొత్త వ్యక్తుల మాటలను పట్టించుకోవద్దు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారాలు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. విదేశాల్లో ఉండే విద్యార్థుల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఉద్యోగులు మోసపోవచ్చు. పిల్లల కెరీర్ పై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు.