Today Horoscope In Telugu: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉండనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తర ఆషాఢ నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి రాజయోగం కలగనుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలని అనుకునేవారికి ఇదే మంచి సమయం. మిగతా రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందే అవకాశం. ఉద్యోగులు పదోన్నతిపై శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆనందానికి అవధులు ఉండవు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి ఒత్తడి తగ్గించుకుంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులు సమస్యల నుంచి బయటపడుతారు. కొత్త వ్యక్తులతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ విందుకు హాజరవుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : బ్యాంకుతో జరిపే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెద్దల సలహా తీసుకున్నట్లయితే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : రాజకీయ జీవితం బాగుంటుంది. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది. పిల్లలతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకున్నట్లయితే వెంటనే తిరిగి చెల్లిస్తారు. అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. అందువల్ల నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొన్ని అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. అర్హులైన వారికి వివాహా ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారు. పాత స్నేహితులను కలుస్తారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆర్థికంగా పుంజుకుంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి నిరుత్సాహ వార్తలు వినాల్సి వస్తుంది. పిల్లలు సాధించిన విషయంపై చర్చించుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : పెండింగ్ సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం ఉంటే నిర్లక్ష్యంగా ఉండొద్దు. బంధువుల్లో ఒకరితో వివాదాలు ఏర్పడుతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులకు కొత్త శత్రువులు పుట్టుకొస్తారు. తల్లిదండ్రుల సలహాతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల చాకచక్యంగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మీకు వచ్చే ఆదాయంలో కొంత దానం చేస్తారు.దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నాణ్యమైన ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉండాలి.