Mahakumbha Mela : ప్రయాగ్రాజ్. ప్రపంచంలోని పురాతనమైన, అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటైన మహా కుంభమేళా పూర్తి స్వింగ్‌లో ప్రారంభం కావడంతో ప్రయాగ్‌రాజ్ మొత్తం భక్తితో నిండిపోయింది. కాషాయ దుస్తులు ధరించిన భక్తులు, సాధువుల మంత్రోచ్ఛారణల మధ్య, అందరూ పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద ఆధ్యాత్మిక శుద్ధిని కోరుకుంటారు. ఈ సారి ఎన్నో వింతలు ఈ మేళలో కనిపిస్తున్నాయి. కొందరు వింత వింతగా కనిపిస్తున్నారు. ఓ నాగసాధువు ఏకంగా కొన్ని సంవత్సరాల నుంచి తన చేతిని పైకి మాత్రమే పెట్టాడు. మరో సాధువు కొన్ని సంవత్సరాల నుంచి స్నానం చేయడం లేదు. మరో అందమైన యాంకర్ సాధ్విగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మరో ఇంట్రెస్ట్ టాపిక్ తెలుసుకుందాం.
ఇంతలో, మహా కుంభం నుంచి ఊహించని ఓ అందమైన అమ్మాయి కనిపించి వైరల్ గా మారింది. ఇది జాతరకు హాజరైన ప్రజల దృష్టిని మాత్రమే కాకుండా ఇంటర్నెట్‌లో కూడా ఆకర్షించింది. ఈ సంవత్సరం, ప్రేక్షకులను ఆకర్షిస్తున్నది ఒక మత గురువు లేదా ప్రముఖ వ్యక్తి కాదు, ఇండోర్‌కు చెందిన ఒక సాధారణ దండలు అమ్మే అమ్మాయి. ఆమె అద్భుతమైన అందం ఇప్పుడు మహాకుంభమేళలో చర్చనీయాంశంగా మారింది.
ఈ మహిళ పేరు తెలియదు. కానీ ఆమె చర్మం, మంత్రముగ్ధులను చేసే రహస్యమైన కళ్ళు, పదునైన ఉనితో కూడిన ముఖం కారణంగా, ఆమె ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు ఆకర్షణకు కేంద్రంగా మారింది. ఆమె చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది వినియోగదారులు ఆమెను ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసాతో పోలుస్తున్నారు. అయితే ఈ వైరల్ వీడియోలో, తన చుట్టూ ఉన్న వ్యక్తులను మనం చూడవచ్చు. ఆమె సంప్రదాయ వస్త్రధారణలో, కొన్ని ముత్యాలు, కొద్దిపాటి మేకప్, పొడవాటి జడతో చాలా అందంగా కనిపించింది. మహిళ ఒక సంచి, కొన్ని ముత్యాల హారాలు విక్రయిస్తోంది. ఈ మహిళ వీడియోను శివమ్ లఖ్రా (@shivam_bikaneri_official) పంచుకున్నారు. చాలా కొద్ది సమయంలోనే వీడియో త్వరగా వైరల్ అయ్యింది. అంతే కాదు నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది
చాలా మంది వినియోగదారులు హార్ట్ ఎమోజీలతో అమ్మాయిని ఇష్టపడుతున్నారు. కొందరు ఆమెను “అందమైన” అమ్మాయి అంటూ పిలుస్తున్నారు. కొంతమంది వినియోగదారులు ఆమెను అనుసరించే వ్యక్తుల ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే వారి వల్ల ఆమెకు అసౌకర్యం కలుగుతుంది. అయితే ఒకరు “ఓ మై గాడ్, ఆమె కళ్ళు.” అంటూకొనియాడితే మరొకరు వావ్ ఆమె నిజంగా అందంగా ఉంది. కానీ ఆమెను అనుసరిస్తున్న వ్యక్తులు సిగ్గుచేటు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందరూ ఆమెను చుట్టుముట్టడం కరెక్ట్ కాదు. కానీ నేను కూడా ఆమెపై దృష్టి పెట్టాను. స్వర్గపు అందం అంటూ మరొకరు రాసుకొచ్చారు.ఇక ఒక వ్యక్తి స్త్రీని ప్రసిద్ధ మోనాలిసా పెయింటింగ్‌తో పోల్చి, “వావ్, మోనాలిసా” అని రాశారు. ఆమె అందంగా ఉంది కానీ ఆమె చుట్టు తిరగడం మానేయండి. ఇబ్బంది పెట్టకండి అంటూ కొందరు కేర్ తీసుకుంటున్నారు.