Today June 25 2025 Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు జేష్ఠ అమావాస్య కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండడంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి చెందిన ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకుంటాయి. ఆందోళన వాతావరణం నుంచి బయటపడతారు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తు గురించి ఆర్థిక ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబంలో సమస్యలు ఏర్పడితే వాటిని పరిష్కరించుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు తమ వ్యాపార అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసుకుంటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులు కెరీర్ కు సంబంధించిన విషయాలపై చర్చిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంటి అవసరాల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారం అభివృద్ధి బాటలో సాగుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టేటప్పుడు ఆలోచన చేయాలి. తోటి వారితో సమయమనం పాటించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : వ్యాపారులు ప్రణాళికలు వేసుకుంటారు. లక్ష్యాలను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అందువల్ల శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఉత్సాహంగా ఉంటారు. తెలియని వ్యక్తుల నుంచి కొన్ని వస్తువులను తీసుకోకుండా ఉండడమే మంచిది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కుటుంబ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణం లో ఉంటారు. ఆర్థిక సముద్రం కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. కొందరు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పూర్వీకులు ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో నైపుణ్య ప్రదర్శించడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయాన్ని పొందుతారు. వ్యాపారులు ఆలోచనలు చేయడంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారంలో కొన్ని కీలక మార్పులు చేసుకుంటారు. ఇతరుల వద్ద డబ్బు అప్పుగా తీసుకువస్తే ఈరోజు చెల్లిస్తారు. ఆదాయం పెరిగిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెడతారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : గతంలో జరిగిన ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు మార్గం ఏర్పడుతుంది. ఖర్చులు తగ్గిస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఓర్పుతూ ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి అనుకూలమైన వాతావరణ ఉంది. అనుకోకుండా చేసే ఓ ప్రయాణం సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లలతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సున్నితమైన కార్యకలాపాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఆదాయం సాధారణమైన ఖర్చులు ఉంటాయి. అయితే పొదుపు చేయడం అలవాటు చేసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. బడ్జెట్ కు అనుకూలంగా కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కీలకమైన చర్చలు పెడతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణాన్ని పొందేందుకు ఆరట పడతారు. శారీరకంగా చురుకుగా ఉండడం వల్ల ప్రింటింగ్ పనులను పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంది. కొన్ని పనుల కోసం ఒత్తిడి ఉన్నప్పటికీ చిన్న చిన్న మార్పుల ద్వారా వాటిని పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాలు చేసే వారికి ఇతరుల సహాయం ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు విలువైన వస్తువులను అందిస్తారు.