india england test match live : 471 పరుగుల లక్ష్యాన్ని బలోపేతం చేసుకోవడంలో భారత్ విఫలమైంది.. ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమైంది. బుమ్రా మినహా మిగతా బౌలర్లు మొత్తం దారుణంగా చేతులెత్తేశారు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ (వికెట్లు తీసినా పరుగులు ఇచ్చాడు) జడేజా, శార్దుల్ ఠాకూర్ అంతగా ఆకట్టుకోలేకపోయారు.. ఇక రెండవ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, గిల్ దారుణంగా విఫలమయ్యారు.. ఇంగ్లాండ్ బౌలర్ల ఎదుట చేతులెత్తేశారు. ఈ సమయంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నారు. వీరిద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్లు కరుణ్ నాయర్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, సాయి సుదర్శన్ వంటి వారు ఆకట్టుకోలేక పోయారు. మెరుగ్గా పరుగులు చేయాల్సిన చోట దారుణంగా తడబడ్డారు. వీరు వెంట వెంటనే అవుట్ కావడంతో ఇంగ్లాండ్ మ్యాచ్ మీద పట్టు బిగించింది. దీంతో టీమ్ ఇండియా 371 రన్స్ టార్గెట్ విధించింది.. ఈ పరుగులను ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. రెండవ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చెత్త ఫీల్డింగ్ కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లకు వరమైంది. కీలకమైన క్యాచ్ లను టీమిండియా ఫీల్డర్లు నేలపాలు చేశారు.. దీంతో ఇంగ్లాండ్ జోరు చూపించింది. దూకుడుగా ఆడి విజయం సాధించింది.
ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రెండవ ఇన్నింగ్స్ లో అతడు ఏకంగా 149 పరుగులు చేశాడు.. క్రాలే తో కలిసి తొలి వికెట్ కు 188 పరుగులు జోడించాడు. క్రాలే 65, స్టోక్స్ 53*, జెమీ స్మిత్ 44* పరుగులు చేయడంతో ఇంగ్లాండు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ చెరి 2 వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ సాధించాడు. భారత బౌలర్లలో బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టగా.. రెండవ ఇన్నింగ్స్ లో పరుగులు నియంత్రించినప్పటికీ.. వికెట్ సాధించలేకపోయాడు. ఇక సిరాజ్ కూడా అంతే. మైదానంలో అనవసరమైన ఆవేశం తప్ప.. వికెట్లు నేలకూల్చే బంతులు వేయలేకపోయాడు. ప్రసిద్ కృష్ణ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. బ్యాట్ కు అవసరమైన ఎత్తులో బంతిని వేయడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు బీభత్సంగా పరుగులు తీశారు. శార్దుల్ ఠాకూర్ కూడా అలానే బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండు బ్యాటర్లు పండగ చేసుకున్నారు. వాస్తవానికి తొలి వికెట్ కు డకెట్, క్రాలే 188 పరుగులు జోడించారంటే భారత బౌలింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఫీల్డింగ్ అయితే అత్యంత నాసిరకంగా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో క్యాచులను నేలపాలు చేసిన ఫీల్డర్లు.. రెండవ ఇన్నింగ్స్ లోనూ అదే ధోరణి కొనసాగించారు. రెండవ ఇన్నింగ్స్ లో 335/5 తో పటిష్టంగా ఉన్న టీమిండియా.. 31 పరుగుల వ్యవధిలోని మిగతా ఐదు వికెట్లు కోల్పోవడం విశేషం. ఒక రకంగా టీమ్ ఇండియాలోని ఆటగాళ్ల వైఫల్యం ఇంగ్లాండ్ బౌలర్లకు వరంగా మారింది. 371 రన్స్ టార్గెట్ ను ఇంగ్లాండ్ అత్యంత సులువుగా ఛేదించింది. ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని అందుకుంది.
THE WINNING MOMENT FOR ENGLAND – A RECORD BREAKING CHASE. pic.twitter.com/knNKHzs6ZY
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2025