Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లాంగ్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం వచ్చే నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అనేక మార్లు వాయిదాల తర్వాత ఈ చిత్రం ఎన్నో కష్టాలను ఎదురుకొని ఎట్టకేలకు విడుదలకు నోచుకోబోతుంది. కానీ అభిమానుల్లో మాత్రం మొదటి కాపీ రెడీ అయ్యేవరకు ఈ సినిమా విడుదల అవుతుందనే నమ్మకం లేదు. కారణం ఇన్ని సార్లు వాయిదా పడడమే. మరో పది రోజుల్లో సినిమా విడుదల అవ్వబోతుంది అనగా, ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. మేకర్స్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ నుండి అభిమానులు ఇంకా కోలుకోలేదు. కానీ ఈసారి మాత్రం గురి తప్పే ఛాన్స్ అసలు లేదని, చెప్పిన విడుదల తేదికి ఈ చిత్రం కచ్చితంగా వచ్చేస్తుందని అంటున్నారు మేకర్స్. మరో రెండు రోజుల్లో VFX వర్క్ కూడా సిద్ధం అవ్వబోతుందట.
ఇరాన్ లో గత రెండేళ్ల నుండి ఈ వర్క్ ని చేయిస్తూ వస్తున్నారు మేకర్స్. రేపు, లేదా ఎల్లుండికి థియేట్రికల్ ట్రైలర్ కట్ ని రెడీ చేయబోతున్నారట. వచ్చే నెల 5 వ తారీఖున ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఎందుకు ఈ సినిమా ఇంత ఆలస్యం అయ్యింది?, VFX విషయం లో ఎందుకు నిర్మాత AM రత్నం(AM ratnam) ఇంత మొండిపట్టు పట్టాడు అనేది రేపు ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుందని, మన తెలుగు సినిమా గర్వించ దగ్గ చిత్రాన్ని మేము అందించబోతున్నామని ప్రతీ ఒక్కరికి తెలుస్తుందని అంటున్నారు. అంతే కాదు ప్రొమోషన్స్ కూడా ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తన సినిమాల ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి పెద్దగా ఇష్టం చూపని పవన్ కళ్యాణ్, ఈ సినిమా కోసం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడట.
అదే విధంగా ప్రతీ రోజు రీల్స్ ని కూడా విడుదల చేయబోతున్నారట. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ఇంటర్వ్యూ లతో పాటు, నిర్మాత AM రత్నం ఇంటర్వ్యూలు కూడా ఉంటాయట. అంతే కాదు ఈ సినిమా కోసం ఒక 30 నిమిషాల నిడివి ఉన్న మేకింగ్ వీడియో ని సిద్ధం చేశారట. అంతే దాదాపుగా ఒక డాక్యుమెంటరీ వీడియో అని పిలవచ్చు. ఈ మేకింగ్ వీడియో ద్వారా సినిమా ఎంత గ్రాండ్ గా తీసాము అనేది తెలియచేయబోతున్నారట. హిందీ లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, తమిళం లో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేశారట. ఈ రెండు ఈవెంట్స్ కి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్టు సమాచారం. అదే విధంగా విడుదలకు ముందు మరో రిలీజ్ ట్రైలర్ ని కూడా సిద్ధం చేస్తున్నారట. ఇలా నాన్ స్టాప్ ప్రొమోషన్స్ ప్లాన్ రెడీ చేశారు.