Maharishi Valmiki Jayanti 2024: ఆదికావ్యమైన రామాయణం రచించి కీర్తిని సంపాదించుకున్నారు వాల్మీకి. సంస్కృత ఆది కవి బిరుదును దక్కించుకున్నాడు. అంటే సంస్కృత భాష మొదటి కవి అర్థం. ఆయన జయంతి సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఆయనకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అశ్విమ మాసం పౌర్ణమి తిథి అక్టోబర్ 16న రాత్రి 08:40 గంటలకు తిథి ప్రారంభమవుతుంది. ఈ తేదీ అక్టోబర్ 17 సాయంత్రం 04:55 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వాల్మీకి జయంతిని అక్టోబర్ 17, గురువారం రోజున జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, పూర్వం వాల్మీకి పేరు రత్నాకర్. అను ఒక బందిపోటు దొంగగా ఉండేవాడు. అడవికి వచ్చే వారిని దోచుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఒకసారి అడవికి వచ్చిన నారద మునిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నారద ముని చేసిన బోధనలు అతని హృదయాన్ని కదిలించాయి. తను చేసిన పాపాలు తొలగిపోవాలని తీవ్రమైన తపస్సు చేశాడు. అతని శరీరమంతా చీమలు పాకాయి. దాని కారణంగా అతను వాల్మీకి అయ్యాడు.
రామాయణం కూర్పు
ఇతిహాసమైన రామాయణం కూర్పుకు సంబంధించిన ఒక కథ కూడా ఉంది, దాని ప్రకారం.. వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడి ఆదేశానుసారం రామాయణాన్ని రచించాడు. కథ ప్రకారం.. బ్రహ్మదేవుడు వేటగాడి రూపంలో క్రౌంచ్ పక్షిని చంపాడు. ఆ సమయంలో వాల్మీకి అతన్ని శపించాడు. అయితే ఆ శాపం పద్యం రూపంలో చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నా ప్రేరణ వల్లే నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయి. కాబట్టి, మీరు శ్రీ రాముడి పూర్తి చరిత్రను శ్లోకాల రూపంలోకి మలచాలని కోరాడు. బ్రహ్మదేవుడి ఆదేశానుసారం వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని రచించాడు.
మహర్షి వాల్మీకి జయంతిని ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. వాల్మీకి జయంతికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లోని అన్ని పాఠశాలలను అక్టోబర్ 17న మూసివేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి.
వాల్మీకి జయంతి సందర్భంగా అక్టోబర్ 17న ఢిల్లీలో అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఈ డ్రైడేస్‌లో మద్యం అమ్మకాలను నిలిపివేసినందుకు లైసెన్స్‌దారులకు ఎలాంటి పరిహారం అందించబడదని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పంజాబ్‌లో, మహర్షి వాల్మీకి జయంతిని ‘పర్గత్ దివస్’గా నిర్వహించుకుంటారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్రలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్నారు.