Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన యోగం కలగనుంది. అలాగే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. అక్టోబర్ 17 మంగళవారం 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనయోగం కలగనుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అధికారులతో వాగ్వాదానికి దిగొద్దు. హనుమాన్ ను పూజించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు.
వృషభం:
వైవాహిక జీవితం ఉన్న వారిలో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. రోజువారీ పనులపై ఫోకస్ పెట్టాలి. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మరింత ప్రయోజనం కలగాలంటే సూర్యాష్టకం చదవాలి.
మిథునం:
ఈ రాశి వారు చేసే ముఖ్యమైన పనులు ఇతరులకు బాధ్యతలు అప్పగించొద్దు. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. రాజకీయాల్లో ఉండేవారు గుర్తింపు పొందుతారు.గోమాత పచ్చిగడ్డి వేయడం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు.
కర్కాటకం:
విద్యార్థులకు అనుకూల సమయం. గురువుల సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి. వివిధ రంగాలలోని వారు సైతం అనుకున్న పనులు నెరవేర్చగలుగుతాయి. ఇష్టదైవాన్ని పూజించాలి.
సింహం:
కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. ఇతరుల సలహాలు ఉపయోగపడుతాయి. గతం నుంచి ఉన్న డబ్బు సమస్య పరిష్కారానికి వస్తుంది. మరిన్ని అనుకూల ఫలితాలు ఉండాలంటే పసుపు వస్తువులు దానం చేయాలి.
కన్య:
అనుకోని సమస్యలు వస్తాయి. అయినా మనోబలంతో ధైర్యంగా ముందడుగు వేయాలి. దూర ప్రయాణాలుంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించడం శ్రేష్టం.
తుల:
మీ ప్రవర్తనతో అందరి మనుసులు గెలుచుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో ఓర్పు అవసరం. ఇంట్లో సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకూల సమయం. లక్ష్మీదేవిని పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు.
వృశ్చికం:
గతంలో మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సమాయత్తం కావాలి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచి గౌరవం పెరుగుతుంది. రావి చెట్టుకు పాలు కలపిన నీటిని సమర్పిస్తే మరింత మంచి జరిగే అవకాశం.
ధనస్సు:
నగదు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని ప్రారంభించే ముందు భాగస్వామిని సలహా తీసుకోవాలి. విదేశాల్లో ఉన్నవారిని కలిసేందుకు సిద్ధమవుతారు.
మకరం:
ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. ప్రణాళికలతో పనులు పూర్తి చేస్తే కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసే వారికి అనుకూల సమయం.
కుంభం:
ఉద్యోగులు ఉన్నతాధికారులతో వాదనలకు దిగొద్దు. కుటుంబ సభ్యుల వల్ల దిగులుగా ఉంటారు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండడమే మంచిది.
మీనం:
కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మతపరమైన కార్యక్రమాల పై విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులు సూదూర ప్రయాణాలకు సిద్ధమవుతారు. చట్టపరమైన విషయంలో అభిప్రయాలను తెలియజేయాల్సి ఉంటుంది.