ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూల సమయం..

025 మే 11 శనివారం రోజున ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు.

Written By: Chai Muchhata, Updated On : May 11, 2024 7:43 am

horoscope business

Follow us on

Horoscope Today: 2025 మే 11 శనివారం రోజున ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. అలాగే 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం. వ్యాపారుల పెట్టుబడులు లాభిస్తాయి.

వృషభ రాశి:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. విద్యార్థులు కెరీర్ గురించి ఆలోచిస్తారు.

మిథునం:
వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:
వ్యాపారులకు అనుకూల సమయం. పెట్టుబడులపై లాభాలు వస్తాయి. ఉద్యోగులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. వివాహితులకు ప్రతిపాదనలు రావొచ్చు.

సింహ:
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై లాభాలు ఉంటాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు వస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన శుభవార్తలు వింటారు.

కన్య:
కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే దానిని పరిష్కరించడానికి ప్రయత్నించండి.. ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి. వ్యాపారులు అదనపు ఆదాయాన్ని పొందుతారు.

తుల:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.

వృశ్చికం:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సమయం కేటాయిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి.

ధనస్సు:
కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

మకర:
కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు సంయమనం పాటించాలి.

కుంభం:
కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

మీనం:
మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.