Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు మీన రాశిలో శుక్రుడు పయనించాడు. దీంతో కొన్ని రాశుల వారికి సంపద పెరగనుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా విశేష ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. ఏదైనా సమస్య వస్తే అధికారుల సహాయం తీసుకోవాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. డబ్బు అవసరం పడితే ఇతరులు సహాయం చేస్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. తోటి వారితో సంయమనం పాటించడం వల్ల సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పనులు చేపడితే ఇతరుల సలహా తీసుకోవాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే మాటలతో పరిష్కరించుకోవాలి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటారు. ఉద్యోగులు తెలివితేటలు ప్రదర్శించడం వల్ల అధికారుల నుంచి ప్రశంసను పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు శారీరక ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులకు మంచి ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడం వల్ల అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదృష్టం వరించడంతో జీతాలు పెరుగుతాయి. ఏదైనా పనిని ప్రారంభించిన తర్వాత దాని పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేయాలి. లేకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యారాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తెలివితేటలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. తోటి వారు సహకరిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్య వస్తే పరిష్కారం అవుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారు స్నేహితులతో సంతోషంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులు ఏదైనా ప్రాజెక్టులను ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు శత్రువుల పెడదా ఉంటుంది. అయితే వారి దృష్టిని మరల్చేందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇప్పటివరకు చేపట్టిన ప్రణాళికలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు అనుకున్న ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విదేశాల నుంచి శుభవార్తలు ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కాస్త కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు సరైన ప్రణాళిక ద్వారా లక్షాలను పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవహారయాత్రలకు వెళ్తారు. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల నుంచి తన సహాయం అందుతుంది.