Vishwak Sen : యంగ్ హీరోలలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని, క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకరు విశ్వక్ సేన్(Vishwak Sen). కేవలం హీరో గా మాత్రమే కాదు, ఆయన డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా సక్సెస్ లను చూసాడు. 30 ఏళ్ళ వయస్సు కూడా లేని ఈ కుర్రాడు, ఇంత తక్కువ సమయం లో ఇన్ని బాధ్యతలు మోయడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు ఫలక్ నూమా దాస్, మాస్ కా ధమ్కీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆయన దర్శకుడి అవతారం ఎత్తాడు. తెలంగాణ మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, నిర్మాతగా మారాడు.
Also Read : ప్రేక్షకులకు విశ్వక్ సేన్ ప్రమాణం..ఇక నుండి అలా చేస్తే సినిమాల నుండి తప్పుకుంటాను అంటూ ఎమోషనల్ కామెంట్స్!
నిర్మాతగా ఆయన మొదటి చిత్రం విశ్వక్ సేన్ తో తీస్తున్నాడు. ఈ చిత్రానికి ‘కల్ట్’ అనే టైటిల్ పెట్టారు. విశ్వక్ సేన్ ఇందులో హీరో గా నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఆయన జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ‘ఫంకీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఒక పక్క చేస్తూనే, మరో పక్క ఆయన కల్ట్ చిత్రం షూటింగ్ ని కూడా నడిపిస్తున్నాడు. ఈ చిత్రాలపై విశ్వక్ సేన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన గత రెండు చిత్రాలు ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ‘లైలా’ చిత్రానికి అయితే ఆయన కలలో కూడా ఊహించనన్ని వివాదాలు, ట్రోల్స్, మీమ్స్ ని చూసాడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ చెయ్యను అంటూ విశ్వక్ సేన్ ఒక బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దీంతో ఇప్పటి నుండి ఆయన ఆచి తూచి అడుగులు వేయాలని అనుకుంటున్నాడు. మొదటి నుండి విశ్వక్ సేన్ కి డైరేక్షన్ డిపార్ట్మెంట్ మీద మంచి పట్టు ఉంది. జనాల పల్స్ కి తగ్గట్టుగా సినిమాలు ఎలా తియ్యాలో విశ్వక్ సేన్ కి బాగా తెలుసు. అందుకే తన కెరీర్ ని వేరే డైరెక్టర్ చేతిలో పెట్టి రిస్క్ చేసే ఛాన్స్ తీసుకోకుండా, తానే దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. విశ్వక్ సేన్ కి హీరో గా ఫ్లాప్స్ ని ఎదురుకొని ఉండొచ్చేమో కానీ, డైరెక్టర్ గా మాత్రం నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. ఈ సినిమా తో డైరెక్టర్ గా హైట్రిక్ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆయన అనుదీప్ ‘ఫంకీ’ మూవీ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు.
Also Read : విశ్వక్ సేన్ ప్రతి సినిమా రిలీజ్ కి ముందు కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారు..? ఎవరు చేస్తున్నారు..?