https://oktelugu.com/

Today Horoscope In Telugu: తుల తో సహా ఈ రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం..

Today Horoscope In Telugu రాష్ట్ర ఉద్యోగులు లక్షలను పూర్తి చేయాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది.

Written By: , Updated On : March 25, 2025 / 08:04 AM IST
Horoscope Today

Horoscope Today

Follow us on

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురుడు చంద్రుడు కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారం ఈరోజు ఇంటి నిర్మాణం కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. ఎవరైనా పని చేయమని అడిగితే వెంటనే చేయండి. లేకుంటే సంబంధాలు దెబ్బతింటాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : రాష్ట్ర ఉద్యోగులు లక్షలను పూర్తి చేయాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఇంటికి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయొద్దు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కుటుంబంలో వివాదం లేకుంటే మౌనంగా ఉండటమే మంచిది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చేత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఏదైనా పని వాయిదా పడితే దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. వ్యాపారులు శత్రువులు బెడద ఎదుర్కొంటారు. అనవసరపు వివాదాల్లో తల దూర్చొద్దు. కొన్ని విషయాల్లో ఓపికగా ఉండడమే మంచిది.

ర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. షాపింగ్ కోసం డబ్బులు ఖర్చులు అవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంట్లో ఒకరి ఆరోగ్యం పై ఆందోళన ఉంటుంది. ఉద్యోగుల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి కీలక సమాచారం అందుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. పద స్నేహితులను కలవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు బాధ్యతలను అప్పగిస్తే వాటిని వెంటనే పూర్తి చేస్తారు. ఎవరి చేపట్టిన దానిని శ్రద్ధగా చేయాలి. లేకుంటే ఉన్నదా అధికారుల కోపము ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యా రాశి వారు ఈ రోజు పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో లాభాలు వస్తాయి. స్నేహితుల సహాయంతో ధన లాభం పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొంత వారు పరిచయం అవుతారు. దీంతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. కార్యాలయాల్లో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. భాగస్వాములతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . సమాజంలో పనిచేసే వ్యక్తులు గౌరవం పొందుతారు. జీవిత భాగస్వామితో విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఈరోజు రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. ఉద్యోగులు ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే అది విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల్లో ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులకు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులకు ఈరోజు అనుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. విద్యార్థులకు గురువుల మద్దతుతో పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. సాయంత్రం స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా వ్యవహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు పెద్దల సలహా తీసుకోవాలి. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : జీవిత భాగస్వామి సహాయంతో వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహం కోసం ప్రయత్నించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో కొత్త ప్రతిపాదనలు వస్తాయి. బంధువుల్లో ఒకరి నుంచి ధన సహాయం పొందుతారు. అనవసరపు వివాదాల్లో తల దృక్చొద్దు. ఉద్యోగులకు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ప్రైవేటు ఉద్యోగాల పని చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యాలయాల్లో లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతి లభించే అవకాశం. బ్యాంకు రుణం లభిస్తుంది. ఆస్తిని కొనుగోలు చేయాలని చూసే వారికి శుభవార్తలు అందుతాయి. చట్టపరమైన కేసులు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న వారు బ్యాంకు రుణం పొందుతారు. వ్యాపారులు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సాయంత్రం బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్తులో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాలని వస్తాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . వ్యాపారులు ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం చిందిస్తుంది. కొన్ని వస్తువులు ఇంట్లో సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు ఏర్పడతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడిలో పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాల కోసం ఇతరుల సలహా అడుగుతారు.