Sekhar Kammula , Nani
Sekhar Kammula and Nani : మీడియం రేంజ్ హీరోల లీగ్ నుండి స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నటువంటి హీరో ఎవరైన ఉన్నారా అంటే అది నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన అతి తక్కువ సమయంలోనే హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. అంతకు ముందు కేవలం మీడియం రేంజ్ స్పాన్ ఉన్న కథలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ వచ్చిన నాని,, ఇప్పుడు మాత్రం తన పరిధి ని బాగా పెంచేసుకున్నాడు. శ్యామ్ సింగ రాయ్ చిత్రం నుండి నాని రేంజ్ మరో లెవెల్ కి చేరుకుంది. రీసెంట్ గానే ఆయన ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ‘హిట్ 3′(Hit 3 Movie), ‘ది ప్యారడైజ్'(The Paradise Movie) వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.
Also Read : శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ కి ఎందుకంత ప్రాధాన్యత ఉంటుందంటే..?
ఈ రెండు సినిమాల తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే నాని, శేఖర్ కమ్ముల(Shekar Kammula) కాకంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యి చాలా కాలమే అయ్యింది. కానీ తెలిసిందే కదా, శేఖర్ కమ్ముల ప్రతీ సినిమాని తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు. ‘లవ్ స్టోరీ’ తర్వాత ఆయన ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో ‘కుబేర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని జూన్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉంది. ఈ సినిమా విడుదలైన తర్వాతనే నాని సినిమా స్క్రిప్ట్ వర్క్ ని మొదలు పెట్టనున్నాడు శేఖర్ కమ్ముల. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మాత్రమే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
ఈ చిత్రం ఫిదా, లవ్ స్టోరీ తరహా ఒక కూల్ ఎంటర్టైనర్ లాగా ఉండబోతుందట. అయితే నాని తన ప్రతీ సినిమాకు తన మార్కెట్ పరిధి ని పెంచుకుంటూ పోతున్నాడు. ఒకప్పుడు ఆయనకు ఇలాంటి సినిమాలు సెట్ అయ్యేవి ఏమో, కానీ ఇప్పుడు మాత్రం ఆయన రేంజ్ రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇమేజ్ పెరిగిన తర్వాత ఇలాంటి సున్నితమైన సినిమాలు ఆడియన్స్ ఎంత మేరకు ఆదరిస్తారు అనేది చూడాలి. ఇకపోతే ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3 ‘ మే 1వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సినిమా లో నాని ని ఎంత పవర్ ఫుల్ గా చూపించారో మనమంతా చూసాము. చాలా కూల్ గా కనిపించే నాని లో ఇలాంటి వయొలెంట్ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
Also Read : నాని ఇగోను హట్ చేసిన శ్రీకాంత్ ఓదెల… మరి ప్యారడైజ్ పరిస్థితి ఏంటి..?