Today Horoscope In Telugu
Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్రుడు బుధుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. దీంతో నాలుగు రాశుల వారికి కలిసి రానుంది. మరి కొన్ని రాశుల వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తను వింటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి చుట్టాల రాకతో సందడిగా ఉంటుంది. సోదరుడు సహాయంతో ఉద్యోగులు లక్షణాలు పూర్తి చేస్తారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సోదరుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేకత వహించాలి. ఎవరి దగ్గర అప్పు తీసుకునే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఆ అప్పు తిరిగి చెల్లించడానికి చాలా కష్టమవుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): మిథున రాశి వారు ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారుల ఎదుగుదలను చేసి కొందరు గౌరవ లేక పోతారు. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయాలి. పెండింగ్లో ఉన్న అప్పు వెంటనే తీర్చాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. లాంగ్ టర్ము ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి అధిక లాభాలు వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నీ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యుడుని సంప్రదించాలి. ఉపాధి కోసం చూస్తున్న వారికి అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగులు అవకాశాలను చేజిక్కించుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థుల ఈరోజు విజయాలు సాధిస్తారు. వ్యాపారులకు అనుకోకుండా లాభాలు వస్తాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇంటికి కొత్త వ్యక్తుల రాకతో సందడిగా ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు. అవసరమైన మేరకు డబ్బు అందుతుంది. బంధువుల నుంచి నిరాశ వార్తలో ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. సోదరుల మద్దతుతో వ్యాపారులు లాభాలను పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దీంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందలేరు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంటుంది. కొన్ని పనుల వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా కొన్ని పనులు పూర్తి కావడంతో కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అయితే స్నేహితుల్లో కొందరు సాయం చేయడానికి ముందుకు వస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వాదనలకు దూరంగా ఉండాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు తమ తెలివితేటలతో కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు. ఉద్యోగులు లక్షల పూర్తి చేయడంతో జీతం పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. దేశాలు ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్ద సలహా తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. గతంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇంట్లో జరిగే శుభకార్యాల గురించి చర్చిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : లక్ష్యాలను సాధించడం పై విద్యార్థులు ప్రత్యేక దృష్టి పెడతారు. కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పై శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఓ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Today horoscope in telugu 24 march 2025
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com