Today Horoscope In Telugu: జ్యోతిష శాస్త్ర ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. ఫలితంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే అనేక అనర్ధాలు జరుగుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు వల్ల పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మందుల నుంచి తన సహాయం పొందుతారు. అనవసరమైన రిస్కులు తీసుకోకూడదు. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో పెద్దల సలహా తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ఉపశమనం పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . మీ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. అందువల్ల దుబారా ఖర్చులకు పోకుండా సాధ్యమైనంతవరకు పొదుపు చేయాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండొచ్చు. ఈ కారణంగా మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఆదాయం పెరిగిన ఖర్చులు ఉంటాయి. తెలివితేటలతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారం నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే నైపుణ్యాలు ప్రదర్శించడం వల్ల కాస్త ఇబ్బంది తక్కువగా ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు చట్టపరమైన చిక్కుల్లో ఉంటే నేటితో బయటపడతారు. భాగస్వాముల మధ్య వ్యాపార ఒప్పందాలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు అధికారులతో సంయమను పాటించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడతారు. దీంతో మెరుగని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దీంతో మనసు ఉల్లాసంగా మారుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. ఇతరులకు అప్పు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాల ఏర్పడితే సమస్య పరిష్కరించుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పెండింగ్ పనులకు పూర్తి చేస్తారు. గతంలో ఉన్న సమస్యలను నీటితో పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అనుకూలంగా మారుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. ఎటువంటి ప్రమాదకరమైన పనులు చేయవద్దు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సొంతవాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉంటుంది. అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యంపై ఏ చిన్న నిర్లక్ష్యం వహించిన పెద్ద ప్రమాదమే ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కొందరితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారంలో ఈ విషయంలో మౌనంగా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులను కలుసుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి చెందుతారు. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారుల పనుల్లో అడ్డంకులు సృష్టిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరికి డబ్బు దానంగా ఇవ్వకూడదు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఏదైనా రిస్కు పని చేపట్టేటప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు పొందాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో తల దురచకుండా ఉండడమే మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. . ఈ రాశి వారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు నీటితో పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలు ఆయుధ వేసుకోవడమే మంచిది. అయితే తప్పనిసరి అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎన్నికలతో ఉల్లాసంగా ఉంటారు.