Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో తో కొన్ని రాశుల వారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మరికొన్ని రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు తోటి వారితో కలిసి కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఎవరికి డబ్బు అప్పు ఇవ్వకుండా ఉండాలి.
వృషభరాశి (కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు తోటి వారితో కలిసి సంతోషంగా ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అయితే కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా చేసే పర్యటనలు వ్యాపారులకు లబ్ధి చేకూరుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి బిజీగా మారుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఇంటికి చుట్టాలు రావడంతో సందడిగా మారుతుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల మద్దతు ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అయితే దుబార ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చూసే ఉద్యోగులకు శుభవార్తలు వందుతాయి. కొన్ని కారణాలవల్ల దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్త వారితో కలిసి వ్యాపారులు పెట్టుబడులు పెడతారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈరోజు వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పనిపై శ్రద్ధ వహించడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు ఊహించిన దానికంటే లాభాలు పొందుతారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. కార్యాలయంలో ఉద్యోగులకు మద్దతు ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమయం అనుకూలంగా పనులు పూర్తి చేయాలి. లేకుంటే అధికారుల నుంచి ఒత్తిడి ఎవరు కావాల్సి వస్తుంది. స్నేహితుల సహాయంతో కొన్ని అప్పులను తీరుస్తారు. ధన లాభం పెరగడంతో సంతృప్తిగా ఉంటారు. కత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏర్పాటుచేసిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి. పెద్దల సలహాలతో పెట్టుబడులు పెడతారు. విద్యార్థుల పోటీ పరీక్షల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే తల్లిదండ్రుల మద్దతు పొందాలి. పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. తోటి వారి సహాయంతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. మీరు చేసే పనులపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా మారుతారు. అయితే ఎవరికైనా అప్పు ఇస్తే జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. లాభాలు తీసుకునే క్రమంలో పోటీ ఉంటుంది. శత్రువులతో పోటీపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు ఉంటాయి. విద్యార్థుల ఉత్తమమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు లాభాల కోసం పర్యటన చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు సాధిస్తారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి రావడం కష్టంగా మారుతుంది. వ్యాపారులు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు.