Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహాల మార్పు కారణంగా రాశులపై ప్రభావం పడుతుంది. బుధవారం ద్వాదశరాసులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు ఉండలు ఉన్నాయి. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.. గతంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఏమైనా సమస్యలు అంటే వెంటనే పరిష్కరించుకోవాలి. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. విద్యార్థుల కెరీర్ పై ఫోకస్ చేయాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . జీవిత భాగస్వామితో చేసే వ్యాపారం లాభాలను తీసుకొస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో పకడ్బందీగా వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో డబ్బు వ్యవహారం జరపకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఈ క్రమంలో వీరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. దీంతో ఈ రాశి వారు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : కష్టపడి పనులు చేయడం ద్వారా కొన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఏదైనా ఆర్థిక వ్యవహారాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి. పిల్లల చదువుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తే ఈరోజు కలిసి వస్తుంది. గతంలో కంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఉద్యోగులు తమ వ్యవహారాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వీలైతే బదిలీ కావాల్సి కూడా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో నాణ్యత పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రజల నుండి మద్దతు ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. గతంలో ఆగిపోయిన డబ్బు ఈరోజు తిరిగి వస్తుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అందుతాయి. వ్యాపారులకు సాధారణ లాభాలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . . అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు తమ ప్రతిభను ప్రదర్శించడం వల్ల కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. అయితే వీరి నుంచి చాకచక్యంగా బయటపడతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొందరు మీపై చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అందువల్ల కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలను ఇతరులకు అప్పగించద్దు. కొన్ని రహస్యాలను వ్యాపార భాగస్వాములతో పంచుకోవద్దు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు తమ నైపుణ్యాలతో లాభాలను పొందుతారు. కొందరు వ్యక్తులు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అయినా వారి నుంచి తప్పించుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో ఆహ్లాదంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి ఉద్యోగులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు వీరి పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అయితే అధికారుల మద్దతు కూడగట్టుకుంటే కాస్త ఉపశమనం అవుతుంది. విద్యార్థులు మానసిక భారం నుంచి బయటపడతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాజు వారు కొన్ని పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందడానికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కొన్ని పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. ఒకరి వివాహం గురించి ఇంట్లో చర్చిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు లాభాలను పొందిన కొన్ని రహస్యాలను భాగస్వాములతో పంచుకోకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు ఈరోజు లాభాలు పొందుతారు. విద్యార్థుల కెరీర్ పై ఫోకస్ పెడతారు.