Today 9 September Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల ఉద్యోగులు సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. దీంతో ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొన్ని ఖర్చులు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇవ్వకపోవడం మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : కొన్ని ముఖ్యమైన పనులను ఇతరులకు అప్పగించవద్దు. చట్టపరమైన చిక్కుల్లో ఉంటే బయటపడతారు. సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగులకు అవకాశాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు కంపెనీ నుంచి సమాచారం అందుకుంటారు. వ్యాపారులు ఈరోజు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చరిత్రతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. వ్యాపారులు కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉండడంతో ఆదాయం పెరుగుతుంది. పెద్దలు ఇచ్చే వ్యాపార సలహాలు పాటించాలి. పిల్లలతో కలిసి కాలక్షేపం చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేయడంతో ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే అవకాశం వచ్చినా వెనకడుగు వేయడం మంచిది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు వదలకు బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం ఎరుగుపడుతుంది. శుభకార్యాలకు వెళ్లే అవకాశం ఉంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమాజంలో కొన్ని పనులు చేయడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారు భవిష్యత్తు గురించి ప్రణాళిక వేస్తారు. వ్యాపారులు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సాయంత్రం ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఉండాలి. కొత్త పథకాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము ఉంటుంది. అధికారుల అండదండలతో ఉద్యోగులు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లోకి కొత్త వ్యక్తులు రావడంతో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణ ఏర్పడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులకు కీలక నిర్ణయం తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొందరు వీరి గురించి తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎవరి మాటలు నమ్మకుండా ఉండాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. ఉద్యోగులు నైపుణ్య ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల పద్ధతి ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు మాటల మాధుర్యాన్ని చూపించాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో వివాదం ఉంటే తొలగిపోతుంది. ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బులు ఉండడం వల్ల సంతృప్తి చెందుతారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు పెద్దలు సలహా తీసుకోవాలి. కొత్త పెట్టుబడులు ప్రస్తుతం పెట్టకపోవడమే మంచిది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. అయితే కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.