Malla Reddy Tirupati: కొందరికి వయసు అనేది ఉండదు. అది కేవలం వారికి ఒక సంఖ్య మాత్రమే. వయసు పెరుగుతుంటే వారు మరింత యవ్వనవంతులు అవుతుంటారు. ఉత్సాహంగా అడుగులు వేస్తుంటారు. అప్పటిదాకా వారు చేయని పనులు కూడా చేస్తుంటారు. అయితే ఈ తరహా మనుషులు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారు.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
మల్లారెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. అప్పట్లో పాలమ్మిన.. పూలమ్మిన. కష్టపడ్డ.. పైకొచ్చిన.. సక్సెస్ ఐన. అని ఏ ముహూర్తాన ఆ మాటలు అన్నారో గాని.. మల్లారెడ్డి సార్ ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. తనకంటూ తిరుగు లేని ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈరోజుకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తే అది ట్రెండింగ్ లోకి వస్తోంది. రాజకీయంగా ఆయన ఏదైనా మాట్లాడితే మంటలు రేపుతోంది.. శాసనసభలో ప్రజా సమస్యల గురించి ఆయన ప్రస్తావిస్తే మీడియాలో ప్రధాన వార్తాంశంగా మారుతోంది. ఆయన మాటలో తెలంగాణ తత్వం.. ఆయన యాసలో అమాయకత్వం.. ఆయన చూపులో ఆకట్టుకునే తత్వం.. వెరసి మల్లారెడ్డిని మీడియాస్టార్ ను చేసేసాయి. వాస్తవానికి నేటి కాలంలో మీడియా కూడా కావాల్సింది ఇలాంటి వ్యక్తులే కాబట్టి.. మీడియా కూడా ఇలాంటి వారికే విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రైవేట్ న్యూస్ చానల్స్ రాజకీయ నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాయి. అందులో గులాబీ పార్టీలో గొప్ప గొప్ప నాయకులతో చేసిన ముఖాముఖి కంటే.. మల్లారెడ్డి తో చేసిన ముఖాముఖి కే ఎక్కువ వ్యూస్ లభించాయి. దీనినిబట్టి మల్లారెడ్డి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల తన సతీమణితో కలిసి జపాన్ వెళ్లారు మల్లారెడ్డి. అక్కడ అచ్చం జపనీయుల మాదిరిగా వేషధారణతో ఆకట్టుకున్నారు. అక్కడి సాంప్రదాయ వంటకాలను ఆరగించారు. సతీమణితో కలిసి జపాన్ దేశం లోని పలు ప్రాంతాలను సందర్శించారు. అప్పట్లో ఆయన జపాన్ పర్యటన గురించే మీడియాలో చర్చ జరిగింది.. ఇప్పటిక మల్లారెడ్డి మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. ఆయన 72వ పడిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సహజంగా అయితే 70కి పై చిలుకు వయసు ఉన్నవారు మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకోలేరు. కానీ మల్లారెడ్డి అంత వయసున్నప్పటికీ ఉత్సాహంగా పరుగులు పెడుతూ.. మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ ఆశ్చర్యపరిచారు.. ఈ వయసులోనూ ఫిట్ గా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు.