Today 8 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉన్నాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకున్న పనులు అన్ని పూర్తి చేస్తారు. అదనపు బాధ్యతలు చేపడతారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. దీంతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని అనుకున్న పనులు జరుగుతాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదించకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టు పనులను ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కీలక ఒప్పందాలు చేసుకుంటారు. అనవసరంగా ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే పరిస్థితులకు అనుకూలంగా ఉంటే ఎలాంటి నష్టం ఉండదు. అనవసరమైన వాగ్దానాలు చేయకూడదు. ఎవరికీ డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ప్రతికూలమైన వాతావరణం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే చుట్టూ ఉండే వ్యక్తులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. డబ్బును పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే గురువుల మద్దతు అవసరం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉన్నట్లు ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. డబ్బు వ్యవహారంలో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. అయితే ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి వారి సహాయంతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలగాలి. అప్పుడే అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇతరుల సలహా తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల సహాయం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు వివిధ మార్గాల నుంచి డబ్బు అందుతుంది. పెట్టుబడులు పెట్టేముందు ఇంట్లో వారిని సంప్రదించడం మంచిది. ఆర్థికంగా అనేక విషయాలు సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.