Today 5 July 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశుల ఫలితాలు మారుతూ ఉంటాయి. శనివారం ద్వాదశరాసులపై స్వాతీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల వ్యాపారులు ఆర్థిక వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య చిన్న ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో అదనపు బాధ్యతలను చేపడతారు. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు తల్లిదండ్రుల సేవలో పాల్గొంటారు. కుటుంబంలో ఒకరికి అనారోగ్యంగా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. బడ్జెట్కు అనుగుణంగా ఖర్చులు ఉంటాయి. అయితే ఇవి మితిమీరితే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసిన ప్రయత్నాలు పలుస్తాయి. ఆర్థిక వ్యవస్థ పై నియంత్రణ కొనసాగిస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. విద్యార్థుల కెరియర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. చట్టపరమైన చిక్కులకు దూరంగా ఉండటమే మంచిది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారానికి సంబంధించి కొత్త వాగ్దానాలు చేస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : గతంలో సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అకస్మాత్తుగా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉన్నత విద్యా చదవాలని అనుకునే విద్యార్థులు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో ఓ సమాచారం అందుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సరదాగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవడమే మంచిది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. గతంలో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. అయితే కొత్తగా ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలని అనుకుంటే జీవిత భాగస్వామి సలహా అవసరం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు కెరీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొన్ని కీలక సమాచారాలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకోవాలని అనుకుంటే ఇదే మంచి సమయం. దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన వాతావరణం. ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఆర్థిక లావాదేవీల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో పెట్టుబడుల గురించి చర్చిస్తారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని వెంటనే పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యక్తుల నుంచి ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల ప్రశంసలు అందుతాయి. ఆహారపు అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కురి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. గతంలో చేసిన తప్పుల నుంచి బయటపడతారు. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో సంయమనం పాటించాలి.