Tuvalu : అది వాళ్ళు పుట్టిన ప్రాంతం. పెరిగింది, ఎదిగింది, ఉన్నతంగా స్థిరపడింది అన్ని ఆ ప్రాంతంలోనే. ఆ ప్రాంతం వారికి మరో అమ్మ లాంటిది. ఆగాలి పీల్చారు. అక్కడి నీరు తాగారు. అక్కడి ఆహారాన్ని తిన్నారు. అక్కడి మనుషులతో మమకారం పెంచుకున్నారు. బంధాలను ఏర్పరచుకున్నారు. బంధుత్వాలను పెన వేసుకున్నారు. అయితే అలాంటి ప్రాంతంతో ఇకపై వారికి సంబంధం తెగిపోతుంది. ఇక ఆ ప్రాంతం వారికి గతకాలజ్ఞాపకమే కానుంది. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరో 25 సంవత్సరాలలో తమ ప్రాంతం సముద్రంలో కలిసిపోతుందనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
వాతావరణం లో అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాలుష్యం వల్ల భూ వాతావరణం వేడెక్కుతోంది. అందువల్ల రకరకాల పరిణామాలు చోటు చూసుకుంటున్నాయి. ముఖ్యంగా సముద్ర మట్టాలు కనివిని ఎరుగైన స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో ప్రపంచంలో అతిపెద్ద సముద్రమైన పసిఫిక్ కూడా ఉంది. ఈ పస్ఫిక్ సరిహద్దులో తువాలు అనే దేశం ఉంది. ఈ దేశం పసిఫిక్ మహాసముద్రానికి కేవలం ఐదు మీటర్ల ఎత్తులోనే ఉంటుంది. తువాలు దేశం నది అనేక దీవుల సముదాయం. అయితే ఈ దేశానికి టూరిజం మాత్రమే ప్రధాన ఆదాయ వనరు. అయితే ఈ దేశం 2050 నాటికి పస్ఫిక్ సముద్రంలో కలిసిపోతుందని నాసా హెచ్చరిస్తోంది. దీంతో ఆ దేశానికి చెందిన ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. మందస్తుగా ఆస్ట్రేలియా దేశంతో కుదిరిన క్లైమేట్ ఒప్పందం ద్వారా తువాలు దేశానికి చెందిన ప్రజలు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్నారు. ఆస్ట్రేలియా దేశంతో వారికి క్లైమేట్ ఒప్పందం కుదరడంతో.. క్లైమేట్ వీసాలు మంజూరవుతున్నాయి. ఆ దేశ జనాభాలో మూడో వంతు ప్రజలు వీసా కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఈ ఏడాదికి లాటరీ ద్వారా 280 మందిని ఎంపిక చేస్తామని ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు.
అద్భుతమైన దీవులు తువాలు దేశంలో ఉన్నాయి. ఇక్కడ సహజ సంపద విస్తారంగా ఉంటుంది. సముద్ర జంతువులు, అల్చిప్పలు, అరుదైన జంతువులు ఇక్కడ విస్తారంగా ఉంటాయి. గతంలో శాస్త్రవేత్తలు ఈ దేశంలో అనేక ప్రయోగాలు చేశారు. ఇక్కడ చేసిన ప్రయోగాల ద్వారా అనేక ఆవిష్కరణలను రూపొందించారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం దూసుకు రావడం వల్ల ఈ దేశం త్వరలోనే నీట మునగనుంది. ఇప్పటికే ఈ దేశంలో చాలావరకు భూభాగాన్ని పసిఫిక్ సముద్రం ముంచేసింది.. దీంతో ప్రజలు ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతున్నారు..” బాధాకరంగా ఉంది. పుట్టిన ప్రాంతం నీట మునుగుతోంది. మా స్వస్థలం ఇక గత కాలజ్ఞాపకం కానుంది. గుండె నిండా దుఃఖంతో పుట్టిన ప్రాంతాన్ని విడిచి వెళ్లడానికి మేము సిద్ధమయ్యాం. ఇకపై మా ప్రాంతం గుర్తుకొచ్చినప్పుడల్లా కన్నీరు పెట్టడం తప్ప మాకు మరో మార్గం లేదని” తువాలు దేశ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వాతావరణం లో చోటుచేసుకుంటున్న మార్పులే ఈ ఉత్పతానికి కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
More than a third of the population in Tuvalu have applied for a visa to Australia – to escape rapidly rising sea levels.
The pacific island nation is home to 10,000 people and is one of the most at risk places in the world as a result of climate change. pic.twitter.com/oBdIx7QfQm
— Channel 4 News (@Channel4News) July 2, 2025