Today 31 October 2025 Horoscope : జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండరు ఉంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు బిజీగా మారిపోతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : కష్టపడి పనిచేసిన వారికి ఈరోజు సరైన ఫలితం ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎవరైనా వాదనలకు దిగితే ఓపికతో వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. ప్రియమైన వారికి వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్ చేయడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అయితే ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సమాజంలో గౌరవంగా ఉండడంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. వీటిని తోటి వారి సహాయంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు పొంది పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులు గురువుల మద్దతుతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. తల్లితండ్రుల ఆశీస్సులు కూడా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా శుభ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. సన్నిహితుల సహాయంతో ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కీలకని మేం తీసుకుంటారు. విదేశాలకు వెళ్లే వారికి ఇదే అనుకూలమైన సమయం. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల సలహాతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే సోదరుల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకోవాలి. ఉద్యోగులకు అధికారం నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇదే సమయంలో తోటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అప్పుడే ఎవరితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తే పెద్దన సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. మహిళా ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనాల్సి వస్తే గురువుల మద్దతు ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో గతంలో చేపట్టిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ ఇస్తారు. ఉద్యోగులు అధిక ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబం కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇంటి నిర్మాణ కార్యక్రమంలో బిజీగా ఉంటారు. ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకోవడానికి ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. బడ్జెట్ ఆధారంగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో డబ్బు వ్యవహారాలు అప్పుడే జరపకుండా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన పనులు ఉండడంతో మనశ్శాంతి ఉంటుంది. వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఏ రాశి వారు ఈరోజు సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే పెద్దన సలహా తీసుకోవడం మంచిది. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలతో సరదాగా ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు లాభాలను ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఉద్యోగులు దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఇలాంటి సమయంలో తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.