australia women vs india women : వన్ డౌన్ ప్లేయర్ గా మైదానంలోకి వచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న షపాలి వర్మ విఫలమైంది. ఓ వైపు చేయాల్సిన టార్గెట్ 326 పరుగులు.. ఆస్ట్రేలియా బౌలర్లు భీకరంగా బౌలింగ్ వేస్తున్నారు. పిచ్ కూడా వారికి అనుకూలంగా ఉంది. దీంతో భయం భయంగానే జెమీమా మైదానంలోకి వచ్చింది. వచ్చిన దగ్గరనుంచి చివరి వరకు ఒక పోరాట యోధురాలిగా నిలబడింది. చెత్త బంతులను బౌండరీ వైపు తరలించింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. స్మృతి నుంచి మొదలు పెడితే అమన్ జ్యోతి కౌర్ వరకు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి అదరగొట్టింది. 127* పరుగులు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ను ఓ ఆట ఆడుకుంది.
TWITTER HAS CHANGED THE LIKE BUTTON TO CELEBRATE JEMIMAH RODRIGUES CENTURY AGAINST AUSTRALIA
Tap to check ♥️#INDvsAUS #AUSvIND#INDWvsAUSW #JemimahRodrigues #WomensWorldCup2025 pic.twitter.com/XU5L0Tpzgx pic.twitter.com/JsdxtOO9Zi
— Ashik06 (@Mystic_Ashik) October 30, 2025
క్లిష్ట సమయాలలో సమయోచితంగా జెమీమా అదరగొట్టింది. ఇబ్బంది పెట్టే బంతులను ఆడకుండా వదిలేసింది. తద్వారా ఆస్ట్రేలియా కెప్టెన్ జెమీమా ఔట్ చేయడానికి ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దింపింది. అయినప్పటికీ ఎవరికీ కూడా ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జెమీమా ఆడింది. ఓ సందర్భంలో సాధించాల్సిన పరుగులు పెరుగుతున్న క్రమంలో దూకుడుగా బ్యాటింగ్ చేసింది. మూడో వికెట్ పడిన తర్వాత.. జెమీమా తనలో ఉన్న అసలు సిసలైన క్లాస్ బ్యాటింగ్ ను బయటికి తీసింది. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 48.3 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో అద్భుతమైన గెలుపును సొంతం చేసుకుంది.
నాకౌట్ టోర్నీలలో సాధారణంగా ప్లేయర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. పరుగులు చేయడంలో విఫలమవుతుంటారు. కానీ జెమీమా ఒత్తిడిని కూడా అద్భుతంగా ఆస్వాదించింది. బలమైన ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. అంతేకాదు సెంచరీ చెప్పిన తర్వాత కనీసం సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. సెంచరీ అయిన తర్వాత కూడా ఏమాత్రం రిలాక్స్ కాలేదు. సెంచరీ పూర్తయిన తర్వాత మరింత దూకుడుగా బ్యాటింగ్ చేసి జెమీమా జట్టులో స్ఫూర్తి నింపింది. దీప్తి శర్మ 24, రీచా 26 పరుగులు వేగంగా చేయడం వెనక జెమీమా ఉంది. అందువల్లే అంతటి భారీ టార్గెట్ కూడా టీమ్ ఇండియా ముందు మోకరిల్లింది. జట్టు కోసం ఆడే విషయంలో జెమీమా ఎప్పటికీ ముందుంటుంది. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. జట్టు కోసం ఆడటంలో జెమీమా ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఆమె అదే విధమైన సంతోషాన్ని అనుభవించింది. క్లిష్ట సమయాలలో ఒత్తిడిని ఎదుర్కొంటూ.. తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ.. ఏకంగా సెంచరీ చేసి.. చివరి వరకు నిలబడి గెలిపించింది. జట్టు విజయం సాధించిన తర్వాత జెమీమా ఏడ్చేసింది. తన కోచ్.. తల్లిదండ్రులు.. తోటి ప్లేయర్లను పట్టుకొని భావోద్వేగానికి గురైంది. జట్టు గెలిచిన తర్వాతనే సంబరాలు జరుపుకుంది.
THE HISTORIC MOMENT.
– India knocked out Australia and ended their 15 match winning streak.
pic.twitter.com/20wmHnhEq3— Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2025