Homeఆధ్యాత్మికంToday 3 September 2025 Horoscope: ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారా?

Today 3 September 2025 Horoscope: ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నారా?

Today 3 September 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో ఆయా రాశుల వారి జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. బుధవారం కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారులు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి.. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ డబ్బు వ్యవహారాలు జరుపకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. సోదరుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. బంధువులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు కాస్త ఆలోచించాలి. వ్యాపారులు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉండగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు ఈరోజు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో కంటే మెరుగైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులు ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. దీంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. కొందరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొంది వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షల కోసం తల్లిదండ్రులు సపోర్టుగా ఉంటారు. ఏమైనా కొత్త పనులు ప్రారంభిస్తే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో అప్పుడే రహస్యాలు వెల్లడించకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయాలి. లేకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఎందుకంటే ఇది తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగులు అదనపు భారం నుంచి తప్పించుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు బాధ్యతాయుతంగా పనిచేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. కొత్త వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక బాధ్యతలు అప్పగించొద్దు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు గురువుల మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు జీవిత భాగస్వామితో గొడవపడితే సంయమనం పాటించాలి. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. కొత్తగా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు కొత్త లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడంతో బిజీగా ఉంటారు. అవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అయితే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పనిని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారికి కొన్ని పనులు పూర్తికావడానికి స్నేహితుల సహాయం చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చేపట్టడంతో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఖర్చులు చేస్తారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులకు ప్రత్యర్థుల నుంచి ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కార్యాలయాల్లో సరైన విధులు నిర్వర్తించడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకున్న పనిని పూర్తి చేయడానికి కొత్త వ్యక్తులను సంప్రదిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారులు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రులు శ్రమిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మధ్య సమయం. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలుగా తీసుకోవాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version