Jio And Airtel Users: ఉదయం నుంచి సాయంత్రం దాకా నెట్ బాగానే వస్తోంది. కాల్స్ కూడా పర్వాలేదు. ఆ తర్వాతే అసలైన ఆట మొదలవుతోంది. నెట్ పనిచేయడం లేదు. సిగ్నల్ ఉన్నప్పటికీ కాల్స్ వెళ్లడం లేదు. కాల్స్ రావడం లేదు. ఎందుకిలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇదేదో అనామక నెట్వర్క్ వాడుతున్న యూజర్ల పరిస్థితి కాదు.. ఇండియాలోనే అతిపెద్ద నెట్వర్క్ లు వాడుతున్న యూజర్ల పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు రోజుల తరబడి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ యూజర్ల సమస్యను పరిష్కరించే వారే కరవయ్యారు.
Also Read: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా? గులాబీ గూడు పుఠాణిని బయట పెడతారా?
అత్యుత్తమ నెట్వర్క్.. అద్భుతమైన కవరేజ్ లభిస్తుందని ఊదరగొడతాయి ఎయిర్టెల్, జియో. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. ఐదవ తరం సేవలు అందిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ఈ రెండు నెట్వర్క్ లు.. ఇటీవల కాలంలో యూజర్లకు చుక్కలు చూపిస్తున్నాయి.. ముఖ్యంగా గ్రామాలలో ఒకప్పటి రోజులను రిపీట్ చేస్తున్నాయి ఈ రెండు సంస్థలు. ఇంట్లో ఉంటే ఒక్కచోట మాత్రమే సిగ్నల్ వస్తోంది. అక్కడే నిలబడి ఫోన్ వాడాల్సి వస్తోంది. ఇక వీడియోలు లోడింగ్ లోడింగ్ అంటున్నాయి.. గ్రామాలు మాత్రమే కాదు హైదరాబాదు లాంటి నగరాల్లో కూడా నెట్వర్క్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఫోన్లు కలవకపోవడంతో యూజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత జనరేషన్ మొత్తం ఇంటర్నెట్ ఆధారంగానే పనిచేస్తోంది. ఇంటర్నెట్ ఆధారంగానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా నెట్వర్క్ స్తంభించిపోతున్న నేపథ్యంలో యూజర్లకు నరకం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటి వద్ద నుండి పనిచేసే ఐటి ఉద్యోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నెట్వర్క్ ఒక్కసారిగా డౌన్ కావడంతో కాల్స్ కూడా వెళ్లడం లేదు. కనీసం ఎదుటి వ్యక్తి సమాచారం తెలుసుకునే అవకాశం కూడా లేకపోవడంతో జియో, ఎయిర్టెల్ యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ సమస్యకు కారణమేమిటో ఈ రెండు నెట్వర్క్ సంస్థలు చెప్పలేకపోతున్నాయి. ఇటీవల కాలంలో జియోలో సాంకేతిక సమస్య ఎదురైనప్పుడు దానిని పరిష్కరించారు. ఎయిర్టెల్ మాత్రం సమర్థవంతంగా సిగ్నల్స్ అందించింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ రెండు సంస్థల సేవలు స్తంభించిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతుందో ఎవరూ చెప్పడం లేదు. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో యూసర్లకు కూడా పనులు కావడం లేదు. రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ పరిష్కరించే బాధ్యతను రెండు సంస్థలు భుజాలకు ఎత్తుకోకపోవడం పట్ల యూజర్ల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అత్యాధునిక పరికరాల సహాయంతో నెట్వర్క్ అందిస్తున్నామని చెబుతున్న ఈ సంస్థలు.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పట్టించుకోవడం లేదు. దీనివల్ల యూజర్ల వేదన అరణ్య రోదనగా మారిపోతోంది. మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది.. యూజర్ల ఆవేదన ఎప్పుడు తొలగిపోతుంది.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..