TG EAPCET 2025 Counseling: తెలంగాణ ఎప్‌సెట్ రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు కళాశాలల ఫీజు పంచాయితీతో షెడ్యూల్ విడుదలలో ఉన్నత విద్యా మండలి జాప్యం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వకపోవడంతో చివరకు షెడ్యూల్ విడుదల చేసింది.
Also Read: ఓపెనింగ్స్ లో ‘కుబేర’ కి దరిదాపుల్లో రాలేకపోయిన ‘కన్నప్ప’..ప్రభాస్ కూడా కాపాడలేకపోయాడుగా!
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) 2025 ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను జూన్ 27, 2025న విడుదల చేసింది. ఈ కౌన్సిలింగ్ జూలై మొదటి వారంలో ప్రారంభమై, ఆగస్టు మధ్య నాటికి పూర్తవుతుంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్ (JNTUH) మే 2025లో TG EAPCET ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రక్రియ ద్వారా తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది.
కౌన్సెలింగ్ దశలు. తేదీలు
TG EAPCET 2025 కౌన్సిలింగ్ మూడు రెగ్యులర్ రౌండ్‌లు,అవసరమైతే ఒక స్పెషల్ రౌండ్‌తో నిర్వహించబడుతుంది. ముఖ్యమైన తేదీలు:
మొదటి రౌండ్:
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు: జూన్ 28, 2025 – జూలై 7, 2025
సర్టిఫికెట్ ధృకరణ: జూలై 1, 2025 – జూలై 8, 2025
వెబ్ ఆప్షన్స్ ఎంపిక: జూలై 6, 2025 – జూలై 10, 2025
సీటు కేటాయింపు: జూలై 18, 2025
రెండవ రౌండ్:
ప్రారంభం: జూలై 25, 2025
సీటు కేటాయింపు: జూలై 30, 2025
మూడో రౌండ్:
ప్రారంభం: ఆగస్టు 5, 2025
సీటు కేటాయింపు: ఆగస్టు 10, 2025
కళాశాలలో రిపోర్టింగ్: ఆగస్టు 11–13, 2025
అభ్యర్థులు tgeapcet.nic.in లో తాజా సమాచారాన్ని తనిఖీ చేయాలి.
కౌన్సిలింగ్ ప్రక్రియ వివరాలు
కౌన్సిలింగ్ దశలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: TG EAPCET ర్యాంక్, హాల్ టికెట్ నంబర్‌తో రిజిస్టర్ చేయాలి. ఫీజు: SC/ST అభ్యర్థులకు రూ.600, ఇతరులకు రూ.1200.
సర్టిఫికెట్ ధృవీకరణ: హెల్ప్ సెంటర్‌లలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, కుల/ఆదాయ సర్టిఫికెట్‌లను ధృవీకరించాలి.
వెబ్ ఆప్షన్స్: కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలి.
సీటు కేటాయింపు: ర్యాంక్ మరియు కేటగిరీ ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి.
రిపోర్టింగ్: కేటాయించిన కళాశాలలో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాలి.
అర్హత, డాక్యుమెంట్లు
అభ్యర్థులు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై, ఇంటర్మీడియట్‌లో 45% మార్కులు (రిజర్వ్‌డ్ కేటగిరీకి 40%) సాధించి ఉండాలి. వయస్సు 17–22 సంవత్సరాల మధ్య (SC/ STకి 25 సంవత్సరాలు) ఉండాలి.
అవసరమైన డాక్యుమెంట్లు:
SSC, ఇంటర్మీడియట్ మార్కుల మెమో
ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్
కుల/ఆదాయ సర్టిఫికెట్ (అవసరమైతే)
రెసిడెన్స్ సర్టిఫికెట్ (నాన్–లోకల్ అభ్యర్థులకు)