Today 27 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాసులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు కొన్ని రాశుల వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అనుకూల సమయం ఉంది. మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వ్యాపారులు ఈరోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు భవిష్యత్తు గురించి కీలకమైన ప్లాన్ చేస్తారు. అనుకోకుండా కొత్త వ్యక్తులతో ప్రయాణం చేస్తారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం వరించానుంది. ఉద్యోగులు తమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొందరు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్తవారికి ఎటువంటి రహస్యాలు చెప్పకుండా ఉండాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కష్టపడిన వారికి తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): మీ రాశి వారికి ఈ రోజు ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈరోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇంట్లో గొడవల వల్ల కాస్త మానసికంగా ఆందోళన. తెలియని వారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండడమే మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు వారు ఈరోజు ఏ పని ప్రారంభించిన విజయం సాధిస్తారు. వ్యాపారులకు భాగస్వాలతో విభేదాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో ఉండే వారికి తోటి వారి నుంచి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల ఎటువంటి ఆర్థిక వ్యవహారాలు వారితో జరపకుండా ఉండాలి. ప్రియమైన వారితో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే స్నేహితుల సహాయంతో వాటిని పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం కొన్ని సంస్థల్లో పెట్టబడులు పెడతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో పెద్దలతో సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంది. మీరు ఏ పని మొదలుపెట్టిన వెంటనే పూర్తి చేయగలుగుతారు. అయితే ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేక బహుమతి పొందుతారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. వారితో విభేదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు ఈ రాశి వారికి సానుకూలమైన వాతావరణాలు ఉంటాయి. అయితే ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు.. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల సలహా లేనిదే డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయరాదు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు కొత్త వ్యక్తుల నుంచి ప్రత్యేకమైన బహుమతులను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు పెరిగిపోతాయి. లక్ష్యాలను పూర్తి చేయడానికి ఉద్యోగులు తీవ్రంగా శ్రమిస్తారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడే అవకాశముంది. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలను వాడుకోకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈరోజు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు ఈ రోజు లాభాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు వెంటాడినా కొన్ని రకాల వ్యక్తుల నుంచి ఆదాయం సమకూరుతుంది. అయితే ఖర్చులను జాగ్రత్తగా చేయాలి. పొదుపు మంత్రం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మానసికంగా కొన్ని ఆందోళనలు ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులో చురుగ్గా పాల్గొంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి అధిక లాభాలు. ఉద్యోగులు గతంలో చేపట్టిన కొన్ని లక్ష్యాలలో విజయం సాధిస్తారు. బ్యాంకు నుంచి రుణం పొందడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్తవారికి డబ్బు ఇచ్చే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మానసికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని పరిష్కరించడానికి స్నేహితుల సహాయం ఉంటుంది. కుటుంబంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరిస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థుల కెరీర్ పై తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాలని అనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఇదే సమయంలో తల్లిదండ్రుల సలహాతో భవిష్యత్తుపై కిలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.