Indore And Bhopal Marriage Fear: ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది ఒక మధుర ఘట్టం. అద్భుతమైన జ్ఞాపకం. నచ్చిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి.. జీవితాన్ని గొప్పగా సాగించాలని ఎవరైనా కోరుకుంటారు. మగవారు, ఆడవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరీ ఆలోచనలు ఇదేవిధంగా ఉంటాయి. అందుకే పెళ్లిని ఒక గొప్ప కార్యం లాగా భావిస్తుంటారు.. కాలాలు మారినా.. యుగాలు మారినా.. పెళ్లి అంటే నేటికీ ఒక అద్భుతమైన తంతులాగా కొనసాగుతోంది అంటే దానికి ప్రధాన కారణం.. ఆ బంధంలో ఉన్న గొప్పతనమే.
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
నేటి కాలంలో అమ్మాయిల కొరత ఉండటం వల్ల చాలా ప్రాంతాలలో మగ పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. గతంలో కులాలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు వంటివి పట్టించుకునేవారు. ఇప్పుడు అవేవీ లేకుండా కేవలం పెళ్లి జరిగితే చాలు అనే పరిస్థితి దాపురించింది. కొన్ని ప్రాంతాల్లో అయితే అమ్మాయిలు లేకపోవడంతో చాలామంది అబ్బాయిలకు వివాహాలు కావడం లేదు. దీంతో వారు ఒంటికాయ సొంటి కొమ్ములాగా మారిపోతున్నారు.. వివాహం అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి.. ఒంటరిగా బతికేస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. ఇండోర్, భోపాల్ ప్రాంతాలలో మరో విధంగా ఉంది.
ఇండోర్, భోపాల్ ప్రాంతాలలో వివాహాలు కుదిరినప్పటికీ చేసుకోవడానికి చాలామంది యువకులు వణికిపోతున్నారు. కొందరు కుదిరిన పెళ్లి సంబంధాలను వాయిదా వేస్తున్నారు. అంతేకాదు వధువుల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదు డిటెక్టివ్ లతో పాత ప్రేమలు, ఇతర యవ్వారాలను పరిశోధన చేయిస్తున్నారు. దీనిని స్పౌజ్ క్రైమ్ సిండ్రోమ్ అని సైకాలజిస్ట్ లు పిలుస్తున్నారు.
కుదిరిన పెళ్లి సంబంధాలను ఇండోర్, భోపాల్ ప్రాంతానికి చెందిన వరులు క్యాన్సల్ చేయడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఇండోర్ ప్రాంతానికి చెందిన రఘువంశి రాజా అనే యువకుడిని అతని భార్య మేఘాలయకు హనీమూన్ తీసుకెళ్లి అక్కడే అంతం చేసింది. తన ప్రియుడి సహకారంతో అతనిని కిరాయి హంతకులతో లేపేసింది. రాజా రఘు వంశీ ని అంతం చేసిన సోనం కు భోపాల్ ప్రాంతంతో సంబంధం ఉంది. దీంతో భోపాల్, ఇండోర్ ప్రాంతాలకు చెందిన వరులు వివాహాలు చేసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించడం లేదు. పైగా కుదిరిన బంధాలను కూడా వద్దనుకుంటున్నారు.. భార్య చేతిలో అంతం కావడం కంటే.. ఒంటరిగా ఉండడం మేలని అనుకుంటున్నారు. అందువల్లే వివాహమంటే చాలు భయపడిపోతున్నారు. ఏదో అలా బతికేస్తే చాలు.. ఒకరి చేతిలో చనిపోవడం కంటే అదే మేలు అని వారు భావిస్తున్నారు.. మేఘాల తర్వాత దేశంలో ఆ తరహా సంఘటనలు అనేకం జరిగిన నేపథ్యంలో యువకులు వివాహం అంటే చాలు వణికి పోతున్నారు.