Hoshi Takayuki Story: వందల కోట్ల ఆస్తులు.. అంతకుమించి అనే రేంజ్ లో సౌకర్యాలు. చిటిక వేస్తే చాలు కొండమీది కోతి అయిన కళ్ళ ముందు వాలుతుంది. ఒక మాట చెబితే పరివారం మొత్తం కాళ్ల దగ్గర ఉంటుంది. ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి ప్రత్యేకమైన విమానాల వరకు లెక్కలేదు. పైగా ప్రపంచంలో పలు దేశాల్లో ఆస్తులు.. ఇవన్నీ ఉంటే ఎవరైనా సరే ఆస్వాదిస్తారు. అనుభవిస్తారు. అద్భుతాలు చేస్తారు. అయితే ఇన్ని ఆస్తులు అతనికి సంతృప్తి ఇవ్వలేదు. అసలు డబ్బు అంటేనే అతనికి విరక్తి కలిగింది. సుఖవంతమైన జీవితం అంటేనే కోపం వచ్చింది. ఆ తర్వాత ఇతడు ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడంటే..
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
కొంతమందికి డబ్బును చూసి మిడిసి పాటు ఉంటుంది. సంపదను చూసి పొగరు ఉంటుంది. ఐశ్వర్యాన్ని చూసి తల బిరుసు ఉంటుంది. ఇవేవీ కూడా అతడికి అలాంటి వాటిని కలిగించలేదు. పైగా అవంటే విరక్తి కలిగించాయి. ఒకప్పుడు అతనికి కూడా డబ్బుంటే చాలా ఇష్టం ఉండేది. డబ్బు సంపాదించడం అంటే ఆసక్తి ఉండేది. అందువల్లే వందల కోట్లను సంపాదించాడు. తిరుగులేని స్థాయిలో ఉన్నాడు.. కార్లు, విలాసవంతమైన భవనాలు.. తన సంస్థలు.. అందులో పని చేసే వందలాదిమంది కార్మికులు.. ఇవన్నీ కూడా అతనిని మరో లోకంలో విహరింపజేశాయి.. కాలం గడుస్తున్నా కొద్ది అతడికి డబ్బంటే విరక్తి కలిగింది. ఐశ్వర్యం అంటే కోపం వచ్చింది. విలాసం అంటే బూతు లాగా వినిపించింది. ఇవన్నీ వద్దనుకున్నాడు. మోక్ష మార్గంలో వెళ్లిపోవాలని భావించాడు. దానికి తగ్గట్టుగానే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణించాడు. ఆ వ్యక్తి పేరు హోషి తకాయుకి.
తకాయుకి ది జపాన్.. ఇతడు కొంతకాలంగా మోక్షమార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కన్వర్ యాత్రలో పాల్గొన్నారు. అతడు ఈ యాత్రలో పాల్గొనడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తకాయకి ఆధ్యాత్మిక అనుభూతి పొందిన తర్వాత.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం వదిలిపెట్టాడు. మహా శివుడి సేవలో పూర్తిగా లీనమయ్యాడు. తన అనుచరులతో కలిసి కన్వర్ యాత్రలో పాల్గొన్నారు. అంతేకాదు పుదుచ్చేరి ప్రాంతంలో శివాలయ నిర్మాణానికి 35 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి.. స్వామి మీద ఉన్న తన భక్తిని చాటుకున్నాడు.
జపాన్ దేశంలో బుద్ధిజం అధికంగా ఉంటుంది. చాలామంది బుద్ధుని బోధనలను అనుసరిస్తుంటారు. అయితే తకాయుకి అలా కాదు.. బుద్ధిజాన్ని వదిలిపెట్టి ఈశ్వరుడి సేవలో నిమగ్నమయ్యాడు. ఈశ్వరుడి నామస్మరణలో అతనికి శాంతి లభించింది. మోక్షం సిద్ధించింది. మానసిక ప్రశాంతత దక్కింది. శరీరం బరువు తగ్గినట్టు అనిపించింది. జీవితం ఒక మార్గంలో వెళ్తున్నట్టు గోచరించింది. అందువల్లే అతడు శివుని నామస్మరణలో కొనసాగుతున్నాడు. శివుడి విద్వత్ తన మీద పనిచేస్తుందని చెబుతున్నాడు. అందువల్లే వందల కోట్ల ఆస్తులను కూడా పక్కనపెట్టి కేవలం స్వామి సేవలో తరిస్తున్నాడు.