Today 27 December 2025 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారి ఆదాయం ఈరోజు పెరుగుతుంది. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎవరికైనా ఇచ్చిన వస్తువులను ఈరోజు పొందుతారు. స్నేహితుల ద్వారా ధన సహాయం పొందుతారు. అనుకోకుండా శుభకార్యంలో పాల్గొనాల్సి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు వస్తాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు చాలా అరుదైన రోజు అని చెప్పుకోవాలి. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు లాభాల పంట పండే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఓపికతో వ్యవహరించాలి. కొందరు పనులకు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు తోటి భాగస్వాములతో వివాదం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులు సైతం అధికారంలో నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. కొత్త పనులను ప్రారంభించకపోవడం మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి బంధువుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. దీంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే వీరికి గురువుల మద్దతు ఉంటుంది. కొత్తగా ఏ పని ప్రారంభించిన వెంటనే దాన్ని పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన బకాయిలు వసూలు అవుతాయి. దాదాపు అదృష్టం పొందే అవకాశం ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారవేత్తలకు ఈరోజు కొన్ని సమస్యల నుంచి బయటపడే మార్గం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. సొంత వాహనాలపై కాకుండా పబ్లిక్ వాహనాలపై ప్రయాణం చేయడం మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు తోటి వారి సహకారం ఉండడంతో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యార్థులు భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. దీంతో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే తోటి వారే మోసం చేసే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. గతంలో కంటే ఇప్పుడు లాభాల పంట పండే అవకాశం ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకుంటారు. ఉద్యోగులకు అనువైన వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : మీ రాశి వారు కొన్ని పనుల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పాటుతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు తోటి వారి నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఒత్తిడులను అధిగమిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది.