Today 26 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు ఏది కావాలనుకుంటే అది దగ్గరికి వస్తుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలమైన వాతావరణం ఉండనుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోష వాతావరణముంటుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉన్నట్లుండి ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రయోజనాలు ఉంటాయి. అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం ఈరోజు మెరుగ్గా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఉత్సాహం చూపుతారు. అనవసరంగా ఎవరితోనో వాదనలకు దిగకుండా ఉండాలి. స్నేహితులతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం మెరుగుపడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి. ఎవరితోనూ డబ్బు వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. దీంతో వీరి వ్యాపారం వృద్ధి చెందుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా.. దానిని వెంటనే పూర్తి చేయాలి. విద్యార్థులు కష్టంగా పోటీ పరీక్షలో పాల్గొంటారు. అయితే గురువుల మద్దతు ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సోదరుల మధ్య విభేదాలు ఏర్పడతాయి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులకు క్రమంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతి విషయంలో శుభవార్తలు వినాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి సమయంలో మౌనంగా ఉండటమే మంచిది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు పెద్దలను సంప్రదించాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక రకాలుగా ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. ఆదాయం పెంచుకునేందుకు కష్టపడాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వీటిని వెంటనే పూర్తి చేయాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం ఈరోజు బాగుంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా వస్తాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటి వారితో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉండడంతో ఆదాయం పెరుగుతుంది. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానధర్మాలు చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలుపై దృష్టి పెడతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మీరు ఏ పని ప్రారంభించినా.. అది విజయవంతంగా పూర్తవుతుంది. ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల మద్దతును పొందాలి. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.