Homeఆధ్యాత్మికంToday 26 April 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ఆదాయ పండుగ.. వద్దన్నా...

Today 26 April 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ఆదాయ పండుగ.. వద్దన్నా డబ్బు..

Today 26 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకూల సమయం ఉండడంతో అధిక ఆదాయాన్ని పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు పెట్టుబడి ల విషయంలో కీలక నిర్వహించడం తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొత్త ఆదాయాన్ని పొందుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందడంతో పాటు కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు సరైన గైడ్లైన్స్ ఇవ్వడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆదాయ వనరులు అధికంగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోకుండా శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. సమాజంలో వీరికి గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు తమకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ఉద్యోగులు తోటి వారి సహాయం తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను నిమిత్తం సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అకస్మాత్తుగా ఇంటికి అతిధులు రావడంతో సందడిగా మారుతుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల సహాయం తీసుకుంటారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అధిక హేమా విచ్చించాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రోజువారి లాభాల్లో భాగంగా వ్యాపారులకు అత్యధిక ఆదాయం వస్తుంది

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా పుంజుకుంటారు. కొత్త పెట్టుబడులకు సిద్ధమవుతారు. ఇలాంటి సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. ఏమైనా వారితో జీవితం సంతోషంగా ఉంటుంది. కొందరు వ్యక్తుల ప్రవర్తన వల్ల కాస్త కష్టం కలిగే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారులు కొత్త లాభాలను పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version