Today 25 September 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. గురువారం కొన్ని రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు ఉండలు ఉన్నాయి. దీంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మరికొందరు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : భవిష్యత్తు పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థుల్లో పోటీ పరీక్షలో పాల్గొంటే తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేయాల్సి వస్తే సొంత వాహనాలపై వెళ్లే కూడదు. వ్యాపారులు కొన్ని ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియమైన వారితో వారితో ఈరోజు సమయం గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వ్యాపారులు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయటపడతారు. ఏదైనా జాబ్ కు అప్లై చేస్తే శుభవార్త వింటారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి అనుకూలమైన వాతావరణం.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారుల కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లి ఎందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. కొత్తగా వీరు ఏదైనా పనిని ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్యా రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే వెంటనే పూర్తి చేయాలి. ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండకూడదు. కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే పెద్ద సలహా తీసుకోవాలి. ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టిన వారు శుభవార్తలు వింటారు. ప్రభుత్వ పథకాలు అందే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని పనులు ఆగిపోతాయి. ధరల వద్ద ఉన్న డబ్బు రాకుండా ఉంటుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. తమ తెలివితేటలు ప్రదర్శించడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారం ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అదనపు ఆదాయం పొందాలని అనుకునే వారికి శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : గతంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం వీరిదే ఉంటుంది. వ్యాపారులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వీటిని అదేమించి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు అనుకున్న పనిని ఈ రోజు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకోవడం వల్ల కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థుల పోటీ పరీక్షల కోసం ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. అనుకున్న ఆదాయం రావడంతో సంతృప్తిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సామాజిక సేవలు చేయడం వల్ల మనశాంతి కలుగుతుంది. బంధువులతో ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఖర్చులు ఎక్కువగా పెడతారు. దుబారా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు. ప్రయాణాలు చేస్తే వాహనాలు నడపకుండా ఉండాలి.