Today 25 January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు రథసప్తమి కావడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండలున్నాయి. మరికొన్ని రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు చేపట్టిన ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయంతో పాటు ప్రోత్సాహం కూడా ఉంటుంది. దీంతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే మంచిది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు భాగస్వాములతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. స్నేహితులతో విభేదాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు అనుకునేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : .. ఈ రాశి వారికి ఈ రోజు మెరుగైన లాభాలు ఉండనున్నాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండనుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు తోటి వారి సహాయముంటుంది. బాధ్యతాయుతమైన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితుల సపోర్టు ఉండటంతో కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అన్ని విజయాలే చేకూరుతాయి. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయకుండా ఉండాలి. కొత్త వాహన కొనుగోలు పై ఆసక్తి చూపుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు విశేషమైన లాభాలు ఉంటాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. అందుకు సంబంధించిన చర్చలు కుటుంబ సభ్యులతో జరుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయ సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఆర్థిక విజయాలు చేగురుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం ఎరుగుపడుతుంది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరికి ఊరికే డబ్బు ఇవ్వడం మానుకోవాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు శుభవార్తను అందుతాయి. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు. విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఇతరుల మనసులు నొప్పించకుండా మాట్లాడాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎదుటివారి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఆర్థికంగా మెరుగైన లాభాలు ఉండడంతో సంతృప్తికరంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.