ఏపీలో( Andhra Pradesh) శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారా? కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందా? అందుకు ముహూర్తం ఫిక్స్ చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. 165 అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. అయితే శాసనమండలిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. దానికి కారణం మండలి లో వైసీపీకి బలం ఉండడమే. ఆపై మండలి చైర్మన్గా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. అందుకే ఆ పార్టీకి అక్కడ ఛాన్స్ దక్కుతోంది. ఆపై కొన్ని రకాల బిల్లులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వైసిపి తో పాటు శాసనమండలి పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీల విషయంలో చైర్మన్ మోసేన్ రాజు అడ్డంకిగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను పదవి నుంచి దించేయాలని కూటమి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
* క్రమేపీ తగ్గుతున్న బలం..
మొన్నటి ఎన్నికల ఫలితాల నాటికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బలం శాసనమండలిలో 38 మంది ఎమ్మెల్సీలు. అయితే క్రమేపి వారి సంఖ్య తగ్గుతోంది. ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు అయిష్టత గానే ఆ పార్టీలో ఉన్నారు. మండలిలో కూటమి బలం పెరుగుతూ వస్తోంది. ఆపై పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉండనే ఉన్నారు. ఎక్స్ ఆఫీషుయో సభ్యులుగా మంత్రులు ఉన్నారు. అందుకే మండలి చైర్మన్ మోసేన్ రాజు పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18 నెలలుగా చైర్మన్ మండలిలో వ్యవహరిస్తున్న తీరును కూటమి ప్రభుత్వం తప్పుపడుతోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది.
* ఇంకా రెండేళ్ల పదవి..
2022లో ఎమ్మెల్సి అయ్యారు మోసేన్ రాజు( Mohsin Raju). అయితే అప్పటివరకు తెలుగుదేశం పార్టీ మండలిలో గట్టిపట్టు కొనసాగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే మండలిలో వైసీపీ బలం పెరిగిందో అప్పుడే మోసేన్ రాజుకు చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మోసేన్ రాజుకు రెండేళ్ల పదవీకాలం ఉంది. అప్పటివరకు చైర్మన్గా ఆయనను కూర్చోబెడితే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పదవికి కూడా రాజీనామా ప్రకటించారు. మండలి చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా చేసినా చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. పైగా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైసీపీకి సభలో ఎక్కువగా చాన్స్ ఇస్తున్నారు. అందుకే అవిశ్వాసం పెట్టి మోసేన్ రాజును గద్దెదించాలన్న ఆలోచనలో ఉంది కూటమి. అందుకు వస్తున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో?