Today 25 August 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై ఉత్తర పాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారాలు ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రయత్నాలు విజయం సాధిస్తారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. చట్టపరమైన చిక్కుల నుంచి ఈరోజు బయటపడతారు. ఉద్యోగులు తోటి వారితో సమయమనం పాటించాలి. వ్యాపారులో ఈరోజు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉండడంతో అనుకున్న లాభాలు పొందుతారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. పాత స్నేహితులు కలుస్తారు.
Also Read: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి సీక్రెట్ మీటింగ్?
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : లక్ష్యాలను సాధించడంలో ఈరోజు తీవ్రంగా కృషి చేస్తారు. కొత్త వ్యక్తులతో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తోటి వారి సహాయంతో వీటి నుంచి బయటపడతారు. ప్రభుత్వ అధికారులకు పదోన్నతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు ప్రతిభను ప్రదర్శించడంతో ప్రశంసలు అందుతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): రాజకీయాల్లో ఉండే వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు. మిత్రుల సహాయంతో వీటిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే ఈరోజు విజయం సాధిస్తారు. గతంలో అనుకున్న కొన్ని పనులను ఈరోజు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : మీరు రాశి వారికి ఈ రోజు ఆకస్మికంగా ధన లాభం ఉండే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు కొందరు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో బిజీగా మారుతారు. అనవసరమైన వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఈరోజు ఎక్కువగా గడుపుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేస్తారు. వీరికి అదనపు బాధ్యతలు ఉంటాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు వీరిపై ఆధిపత్యం చలాకించడానికి ప్రయత్నిస్తారు. అయితే తోటి వారి సహాయంతో ఈ సమస్య నుంచి బయటపడతారు. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : మీ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఆటంకాలు ఏర్పడతాయి. అయితే పెద్దల సలహాతో వీటినుంచి బయటపడతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఉద్యోగులకు ఈరోజు ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో సందడిగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలుస్తాయి. వీరు శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. వ్యాపారులకు కొందరు కొత్త వ్యక్తులు కలుస్తారు. అయితే అప్పుడే వీరితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులకు కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందడానికి ప్రయత్నిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఇవి వ్యాపారులకు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసేవారు ఈరోజు లాభాలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వివిధ భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశ్నించడం అందుతాయి. వ్యాపారులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పిల్లల కెరీర్ పై కీలకరి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు అవుతుంది. అయితే వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈరోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు పెద్దల మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు ఈరోజు లాభాలు పొందుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇదే అనుకూలమైన సమయం.