spot_img
Homeఆధ్యాత్మికంToday 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన పండుగే..

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా విలువైన ప్రయోజనాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులు తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధికారుల నుంచి మద్దతు పొందుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అదనపు ఆదాయం చేకూరాలని ఉంది. ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఓపికతో వ్యవహరించాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శక్తి సామర్థ్యాల మేరకు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. రాజకీయాల్లో ఉండే వారికి ఈ రోజు అధిక ప్రయోజనాలు ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవేల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో తోటి వారి మద్దతును పొందుతారు. వ్యక్తిగతంగా మెరుగైన లాభాలు పొందుతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామికి అనుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరాలని ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి. కొత్తగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. ఇతరులతో అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు అనుకున్న ప్రయోజనాలు ఉంటాయి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. తోటి వారి సహాయంతో ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారుల కు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. దీంతో కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. కొన్ని పనులు చురుగ్గా పూర్తి చేస్తారు. ఇతరులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. అవసరమైన మేరకే ఖర్చులు చేయాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త ఆదాయం వనరులు సమకూరుతాయి. దీంతో వ్యాపారులు సంతోషంగా గడుపుతారు. తెలివైన ఆలోచనలు ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారం పై పట్టు సాధిస్తారు. దీంతో అధిక లాభాలు పొందాడానికి అవకాశం ఏర్పడుతుంది. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు వహించాలి. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూరపు బందుల నుంచి శుభవార్తలు అందుతాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దూరపు బంధువుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper