Today 22 October 2025 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారితో సత్సంబంధాలు ఉంటాయి. దీంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సామాజిక సేవలో పాల్గొంటారు. ప్రజల్లో గుర్తింపు వస్తుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాజు వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కష్టపడడం ద్వారా సరైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చిన ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈరోజు సంతోషకరమైన వాతావరణంలో ఉంటారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందాలనుకుంటే ఈరోజు అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఈరోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత అవసరాలు తీసుకునేందుకు దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. కుటుంబం కోసం సమయం కేటాయించాలి. పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు నిరాశ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్తవారికి డబ్బులు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఎవరి దగ్గరనైనా డబ్బు తీసుకోవాల్సి వస్తే ఆలోచించాలి. ఇతరులకు సైతం డబ్బు ఇవ్వకుండా ఉండాలి. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : మీ రాశి వారు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయడంతో సంతృప్తిగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు అనుకోకుండా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఊహించని లాభాలను పొందుతారు. అయితే వీరికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రియమైన వారికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో వాదనలో ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొన్ని పనుల కారణంగా ఉద్యోగులు బిజీగా ఉంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలమైన వాతావరణ ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. సాయంత్రం ఆరోగ్య విషయంలో మార్పులు ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి తోటి వారి సహాయం తీసుకోవాల్సి వస్తుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు చేపట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా భాగస్వాములను చేర్చుకోవాల్సి వస్తే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణ ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది.