Today 21 December 2025 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారులకు ఘననీయమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. వ్యాపారులకు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు సిద్ధమవుతారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. విహారయాత్రలకు వెళ్లేవారు సంతోషంగా కడుపుతారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . మీ రాశి వారు ఈరోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరితోనో డబ్బు వ్యవహారాలు జరపకూడదు. ఒకవేళ జరపాల్సి వస్తే మధ్యవర్తి సహాయం తీసుకోవాలి. అర్హులైన వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు సోదరుల మధ్య ఉన్న విభేదాలనుంచి బయటపడతారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ప్లాన్ వేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. గతంలో చేపట్టిన పనులను ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . గతంలో ఈ రాశి వారు చేపట్టిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . గతంలో అనుకున్న పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. విద్యార్థులు ఏ పోటీ పరీక్షలో పాల్గొన్న విజయం సాధిస్తారు. క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములు కలిసి వస్తారు. దీంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు ఆలధంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. తెలివితేటలను ఉపయోగించి ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకం అని చెప్పవచ్చు. కొన్ని పనులు ఆగిపోయే అవకాశం ఉంది. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడును పెట్టేందుకు సిద్ధమవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు గురువుల మద్దతు ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. అదనంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎవరితోనో ఆర్థిక వ్యవహారాలు జరిపే ప్రయత్నాలు చేయకూడదు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో సానుకూలమైన వాతావరణం ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పాటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో బంధువుల సహాయం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు అనుకోకుండా పెద్ద ఎత్తున లాభాలు పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు రాబడి ఎక్కువగా ఉంటుంది. గతంలో చేపట్టిన ప్రణాళికలు విజయవంతం కావడంతో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.