Homeఆధ్యాత్మికంToday 21 July 2026 Horoscope: రాశుల వారి ఇంట్లో సమస్యలు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

Today 21 July 2026 Horoscope: రాశుల వారి ఇంట్లో సమస్యలు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

Today 21 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ఆదాయాన్ని పొందుతారు. మరికొన్ని రాశుల వారి ఇంట్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహాయం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కానీ ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఉత్సాహం చూపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా సాగుతుంది. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం ఏర్పాటు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇంటికి అతిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు కొత్త ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉండడంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు చట్టపరమైన చెక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు మనసుకు ఉల్లాసాన్ని వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపారాన్ని విస్తరిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల అండదండలు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాటు చేసుకుంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు లాభాల పంట పండుతుంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు. గ్రహాల అనుకూలతతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version