Today 21 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈరోజు వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలు అమ్ముతాయి. గతంలో చేపట్టిన ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు పెద్దలను సంప్రదిస్తారు. విదేశాలతో వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి. దానధర్మాలు చేసేందుకు ముందుకు వస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఇంట్లో జరిగే శుభకార్యానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు అందుకు సంబంధించిన ఏర్పాటు చేసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కూడా ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో అధికంగా లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు పని భారం ఉంటుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆగిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు అందుతాయి. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. ఉద్యోగులకు మానసికంగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన బకాయిలను తిరిగి పొందుతారు. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారులు ప్రత్యర్థుల నుంచి బయటపడే మార్గాన్ని ఆలోచించాలి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆశించిన ఫలితాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో జరిగే శుభకార్యానికి ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారులకు ఒకేసారిగా సంపద పెరిగే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు చాలా విషయాలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు కొందరు ప్రత్యర్థులు ఆటంకాల సృష్టించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అనుకోకుండా ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులు చేసే కొన్ని పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అయితే కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపంలో నిర్ణయం తీసుకోకుండా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అదనపు ఆదాయాన్ని పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల మధ్యలతో విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి. అన్ని రకాల పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది.