spot_img
Homeఆధ్యాత్మికంToday 20 January 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఏ రోజు అన్ని విజయాలే..

Today 20 January 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఏ రోజు అన్ని విజయాలే..

Today 20 January 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అనుకోకుండా గణనీయమైన లాభాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల ఉద్యోగులు చేపట్టిన ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేస్తారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు ఉండలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండడంతో అనుకున్న పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసాలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. అధికారుల నుంచి ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. పదోన్నతులు పొందడానికి ఇదే అవకాశం. నిరుద్యోగులు శుభవార్తలు పెట్టారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టంగా విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొన్ని పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటమే మంచిది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. దీంతో చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా వ్యాపారులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు సమస్యల నుంచి బయటపడతారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. వ్యాపార పర్యటనలు చేస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన అవసరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగులు చురుగ్గా వ్యవహరించడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వీకులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు అకస్మాత్తుగా ధన లాభం పొందుతారు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ఉత్సాహంగా ఉండడంతో ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper