spot_img
Homeఆధ్యాత్మికంToday 19 March 2026 Horoscope: ఉగాది వేళ ఈ రెండు రాశులు మినహా మిగతా...

Today 19 March 2026 Horoscope: ఉగాది వేళ ఈ రెండు రాశులు మినహా మిగతా వాటన్నింటికీ విజయాలే.. ఇందులో మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..

Today 19 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సర తొలి రోజు గురువారం నాడు ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా కొన్ని రాశుల వారికి ధనయోగం లెక్కలా పట్టుకొనుంది. మరికొన్ని రాశుల వారు ప్రత్యర్థులతో మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉండే అవకాశం ఉంది. తెలుగు సంవత్సరం ప్రారంభం సందర్భంగా వీరికి శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టే ఉద్యోగులు తోటి వారి సహాయం తీసుకుంటారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వికులు ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపారులకు పెద్దల అండదండలు ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు తల్లిదండ్రుల ఆశీస్సులను పొందుతారు. గతంలో ఆగిపోయిన డబ్బు పశువులు అవుతుంది. ఎండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సక్సెస్ అవుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి. విద్యార్థులకు గురువుల అండదండలు ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలి. రాజకీయాల్లో ఉండే వారికి అవకాశాలు అందుతాయి. ఉగాది సందర్భంగా వీరికి శుభ ఫలితాలే ఉండనున్నాయి.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. వ్యాపారులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. కొన్ని సమస్యలు ఉండడంవల్ల మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. కుటుంబ సభ్యులకు కోసం ప్రత్యేకంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు పూర్తి కావడం తో ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు. నిరుద్యోగ శుభవార్తలు అందుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కొన్ని ఫలితాలు అనుకున్నట్లు ఉండడంతో కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు అందుకు సంబంధించిన ఏర్పాటు చేసుకుంటారు. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. రాజకీయాల్లో ఉండే వారికి నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. వీరు మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది. అనవసరపు వాదనలకు దూరంగా ఉండాలి. ఇష్టం లేని వ్యక్తులతో కలిసి ఉండడం వృధా.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తారు. భవిష్యత్తులో చేపట్టబోయే పనుల కోసం ఇప్పుడు పెట్టుబడులు పెడతారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పై శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యమైన వాతావరణంలో ఉంటారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. ఒత్తిడి నుంచి బయటపడతారు. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి శని గ్రహం ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇంట్లో ఆందోళన తర్వాత వాతావరణం ఉంటుంది. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అన్ని పనులు ఒకేసారి చేయడానికి ముందుకు వస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దలకు అండదండలు ఉంటాయి. విద్యార్థులు బోడి పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి m

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular