spot_img
Homeఆధ్యాత్మికంToday 16 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు డబ్బే...

Today 16 April 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు డబ్బే డబ్బు..

Today 16 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం లభిస్తుంది. మరికొన్ని రాశుల వారు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. అయితే పెద్దలను సంప్రదించిన తర్వాతనే ముందుకు వెళ్లాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ప్రియమైన వారితో ఈరోజు సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. విదేశాల్లో చదువుకునేందుకు సిద్ధమయ్యే వారికి శుభవార్తను అందుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు వీరి మద్దతు ఉండడంతో అనుకున్న లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం లభించడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనవసర చిక్కులకు దూరంగా ఉండటమే మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పాటు చేసుకుంటారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి ఈరోజు లాభాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు డబ్బు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటే వారికి అప్పుడే ఆర్థిక వ్యవహారాలు అప్పచెప్పదు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ప్రవర్తన మానసికంగా ఆందోళన కలిగిస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు విద్యారంగంలో ఈరోజు ఉత్తమ ఫలితాలను పొందుతారు. సమాజంలో గౌరవం లభించడం వల్ల రాజకీయ నాయకులకు ప్రజల మద్దతు ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. పెద్దల సహకారంతో అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయాల్లో సంతోషకరమైన వాతావరణము ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి తోటి వారి సహకారం ఉంటుంది. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండాలి. పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన వారికోసం ప్రత్యేకంగా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. గతంలో చేపట్టిన కొన్ని పనులకు ఇప్పుడు సరైన ఫలితాలు పొందుతారు. బాధ పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి ఇదే మంచి సమయం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version