Rukmini Vasanth Dragon movie : ఈమధ్య కాలం లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు రుక్మిణి వాసంత్(Rukmini Vasanth). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘సప్త సాగరాలు ఎల్లో’ సిరీస్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాంతారా 2’ చిత్రంలో విలన్ గా నటించి ఎంత మంచి పేరు సంపాదించిందో మన అందరికీ తెలిసిందే. చూపులు తిప్పుకోలేనంత అందం, అద్భుతమైన నటన , ఈ రెండు ఒకే హీరోయిన్ లో ఉండడం చాలా అరుదు. అందుకే రుక్మిణి వాసంత్ కి అవకాశాలు క్యూలు కడుతున్నాయి. కన్నడ , తమిళం , తెలుగు అనే తేడా లేదు , ప్రతీ భాషలోనూ మేకర్స్ ఈమె డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈమె మాత్రం డేట్స్ కేటాయించడం లో విఫలం అవుతోంది.
కారణం ‘డ్రాగన్’ చిత్రమే. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆమె మేకర్స్ తో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూన్ నెలతో ఆమె కాంట్రాక్టు పూర్తి అవుతుంది. కానీ ఈ సినిమా అత్యధిక శాతం రీ షూట్స్ కి పరిమితం అవుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఒక పట్టాన షాట్స్ నచ్చడం లేదు. తీసిన షాట్స్ ని మళ్లీ మళ్లీ తీస్తున్నాడు. ఆ కారణం చేత రుక్మిణి వాసంత్ అదనపు కాల్ షీట్స్ ని ఈ చిత్రం కోసం కేటాయించాల్సి వస్తోంది. దీంతో ఆమె ఒప్పుకున్న సినిమాల నుండి తప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలను వదులుకున్న రుక్మిణి వాసంత్, రీసెంట్ గానే ధనుష్ తో చెయ్యాల్సిన సినిమాని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె స్థానం లోకి ‘ధురంధర్’ సిరీస్ హీరోయిన్ సారా అర్జున్ ని తీసుకున్నారు మేకర్స్.
కేవలం ఒక్క సినిమా కోసం ఇన్ని సినిమాలను వదులుకుంటుందంటే, రుక్మిణి వాసంత్ కి ఈ సినిమా పై ఎంత నమ్మకం అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా హిట్ అయితే పర్వాలేదు, కానీ పొరపాటున ఫ్లాప్ అయితే రుక్మిణి పరిస్థితి ఏంటి?, ఆమె కెరీర్ వెనక్కి వెళ్లాల్సిందే కదా. అనవసరంగా రిస్క్ చేస్తుందేమో అని ఆమెని అభిమానించేవాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి మలయాళం హీరో టోనివో థామస్ తప్పుకున్నాడు. ఈయన ఆ చిత్రం కోసం ఏకంగా నెల రోజుల డేట్స్ కేటాయించాడు. రామోజీ ఫిలిం సిటీ లో ఎన్టీఆర్, టోనివో కాంబినేషన్ లో చాలా సన్నివేశాలు తీశారు. కానీ మళ్లీ అవి రీ షూట్ చెయ్యాలని ప్రశాంత్ నీల్ కోరడం , అందుకు ఒప్పుకోలేక ఈ చిత్రం నుండి టోనివో తప్పుకోవడం జరిగింది. అలా రుక్మిణి కూడా తప్పుకొని ఉండుంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
