Today 12 July 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వ్యాపారులో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపితే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : . ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాపారాలు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టుల గురించి ఒప్పందాలు చేసుకుంటారు. అయితే దీనిని పూర్తి చేయడానికి తోటి ఉద్యోగుల సహాయం అవసరం ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పరుగులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీపరీక్షలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరికి తల్లిదండ్రులకు ఉత్సాహం ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు అదనపు బాధ్యతలను చేపడతారు. వీరికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. స్నేహితుల్లో ఒకరు ధన సహాయం చేస్తారు. అయితే కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతరులతో మాట్లాడే సమయంలో సంయమనం మనం పాటించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు వారు ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వివాహానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . విద్యార్థులు భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. వీరికి తల్లిదండ్రుల సలహా కూడా ఉంటుంది. స్నేహితులతో దూర ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేయడంతో ప్రశంసలు అందుకుంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈరోజు వారు ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల్లో సమస్యలు ఎదురవుతే మౌనంగా ఉండడమే మంచిది. వ్యాపారులు కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయడమే మంచిది. విద్యార్థులు గురువుల సహాయంతో పోటీ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . తులారాశి వారు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్దలు సలహా తీసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కుటుంబ సభ్యులను సంప్రదించాలి. పిల్లల కెరీర్ గురించి ఆలోచిస్తే.. పెద్దల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరి ప్రయాణాల వల్ల భవిష్యత్తులో లాభాలు ఉండే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులలో వెంటనే పూర్తి చేసుకోవాలి. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేయడంతో బదిలీ అవుతారు. పాతవి ఆర్థిక లావాదేవీలు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలి. పెండింగ్లో ఉండడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. గతంలో పూర్తి చేసిన వాటిపై ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు కొత్త కోర్సులో చేరేందుకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. కొన్ని కారణాలవల్ల స్నేహితులతో విభేదాలు ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఉద్యోగులు కార్యాలయాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. వీరితో జరిపే ఆర్థిక వ్యవహారాలు అందరికీ లాభాలను తీసుకొస్తాయి. ఈరోజు ఎవరికీ అప్పుగా ఇచ్చే ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే అది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు అనుకోకుండా తీర్థ క్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యుల్లో సమస్యలు ఏర్పడితే మౌనంగా ఉండడమే మంచిది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో సోదరుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆశతో వచ్చే వ్యవహరించాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు దూర ప్రయాణాలు చేస్తే వాటి నుంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారం చేసే వారికి లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వీరికి తోటి వారి మద్దతు ఉండటంతో ఉత్సాహంగా పనిచేస్తారు.