Today 10 September Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : గతంలో మొదలుపెట్టిన పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరితోనైనా డబ్బు వ్యవహారం జరిపేటప్పుడు పెద్దలను పక్కన ఉంచుకోవడం మంచిది. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలు పాల్గొంటే వారికి మద్దతు ఇవ్వడం మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు కొత్త ప్రణాళిక ప్రకారంగా పెట్టుబడులు పెడతారు. అధికారుల నుంచి ఉండే ఒత్తిడి మాయమవుతుంది. వ్యాపారులకు తోటి వారి సహకారం ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వారితో కలిసిమెలిసి ఉండడం వల్ల బంధాలు బలపడతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కొత్త పనిని ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. విద్యార్థులకు గురువుల నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. వీరి నుంచి బయటపడడానికి ప్రత్యేకమైన ప్లాన్ వేయాలి. నిరుద్యోగులకు శుభవార్తను అందుతాయి. అనుకున్న స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త విజయాలను అందుకుంటారు. వ్యాపారులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. ఉద్యోగులు తోటి వారి సహకారంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మరికొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన బహుమతులు అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ బలపడుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతో బిజీగా మారిపోతారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కోర్టు కేసుల నుంచి విముక్తు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు స్నేహితుల కారణంగా నష్టపోతారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు మార్గం ఏర్పడతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో పనిచేస్తారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కొన్ని పనుల పూర్తి కావడానికి తీవ్రంగా కష్టపడతారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. పాత స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు. గురువుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొని విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వ్యాపార రహస్యాలను ఇతరులకు పంచకుండా ఉండాలి. ఇంట్లోకి ఆకస్మికంగా అతిథులు వస్తారు. దీంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేస్తారు. పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు ప్రభుత్వ ఉద్యోగులు అయితే పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు వ్యాపారంలో కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు కోరుకుంటే బదిలీలు ఉంటాయి. అదనపు అవకాశాలు వస్తాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈరోజు ఆథికి సంబంధించిన విషయంలో శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వృధా ఖర్చులకు దూరంగా ఉండాలి. అవసరమైన డబ్బు అందుతుంది.